Tirupati Laddu: చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. వారెవరో తేల్చిండి అంటూ..

|

Sep 19, 2024 | 1:09 PM

చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయమై దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్‌ చేశారు. ఇక పలువురు వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉంటే ఈ అంశంపై తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్‌లో వేదికగా ఆమె పలు ప్రశ్నలు సంధించారు. తిరుమలను తిరుమలను అపవిత్రం చేస్తూ...

Tirupati Laddu: చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. వారెవరో తేల్చిండి అంటూ..
YS Sharmila
Follow us on

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్‌ ఫ్యాట్‌ వారంటూ చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి తెర తీశాయి. దీంతో ఇప్పుడీ అంశం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటోంది.

చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయమై దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్‌ చేశారు. ఇక పలువురు వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉంటే ఈ అంశంపై తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్‌లో వేదికగా ఆమె పలు ప్రశ్నలు సంధించారు. తిరుమలను తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

షర్మిల్ ట్వీట్..

లేదంటే సీబీఐతో విచారణ చేపట్టాలని అన్నారు. మహా పాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని షర్మిల ట్విట్టర్‌ వేదికగా రాసుకొచ్చారు. మరి ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..