ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కూటమి అభ్యర్థుల దూకుడు.. లైవ్ వీడియో
Ap Municipal Election Resul

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కూటమి అభ్యర్థుల దూకుడు.. లైవ్ వీడియో

Updated on: Nov 03, 2026 | 10:58 AM

ఆంధ్రప్రదేశ్‌లో 92 పురపాలికలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతుండగా, తాజా ట్రెండ్స్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మురసు తుఫాన్‌ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. మురసు తుఫాను ప్రభావంతో రెండు మూడు చోట్ల ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. రాష్ట్రంలో మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్‌ జరగగా… 138 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. సాయంత్రం వరకు పూర్తిగా ఫలితాలు వెలువడనున్నాయి..

ఇప్పటికే.. 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం కాగా.. మున్సిపాలిటీల్లోని 3 వేల 020 వార్డులకు గానూ 637 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం స్థానాలకు 10వేల 262 మంది పోటీ చేశారు. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించిన తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం నాటికి కొన్ని ఫలితాలు రానుండగా.. సాయంత్రం వరకు పూర్తిగా వెలువడనున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా?

Published on: Nov 03, 2026 10:55 AM
Loading...
Unable to load recommendations.
Follow Us