వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

|

Jun 26, 2024 | 6:06 PM

ఏపీలో వైసీపీ ఆఫీస్‌ల కూల్చివేత నోటీస్‌పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకూ ఎలాంటి కూల్చివేతలు జరపొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి కట్టారని మంగళగరి సెంట్రల్ ఆఫీస్‎ను సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఏపీలో అధికార, విపక్షాల మధ్య పార్టీ ఆఫీసుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు.

వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
Ap High Court
Follow us on

ఏపీలో వైసీపీ ఆఫీస్‌ల కూల్చివేత నోటీస్‌పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకూ ఎలాంటి కూల్చివేతలు జరపొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి కట్టారని మంగళగరి సెంట్రల్ ఆఫీస్‎ను సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఏపీలో అధికార, విపక్షాల మధ్య పార్టీ ఆఫీసుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు. గత రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్రకార్యాలయాన్ని యుద్దప్రాతిపదికన సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయాలకు నోటీసులు పంపించింది.

అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకుంటామని, వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలుచేసిన జీవో ప్రకారం పార్టీ కార్యాలయాలను నిర్మించామని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సీఆర్డీఏ అధికారులు రాష్ట్రంలో మొత్తం 10 వైసీపీ ఆఫీస్‌లకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని చెబుతున్నాట్లు తమ పిటిషన్‎లో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ భూములు, నిబంధనల ఉల్లంఘన అంటూ ఒక్కోచోట ఒక్కో కారణం చెబుతూ ప్రభుత్వం ప్రతీకారచర్యలకు పాల్పడుతోందంటూ రిట్ పిటిషన్ వేశారు. వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పి రెడ్డి వేసిన పిటిషన్ ఈరోజు విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు. మధ్యాహ్నం విచారణ తరువాత తర్వాత స్టేటస్ కో జారీ చేసింది. రేపు ఇదే కేసును విచారిస్తామని ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంత వరకు వైసీపీ కార్యాలయాలను కూల్చివేయొద్దంటూ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..