AP High Court: గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశం

|

Oct 19, 2022 | 1:24 PM

గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం వార్డు సెక్రటరీలకు..

AP High Court: గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశం
Ap High Court
Follow us on

గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిష్ట్రేషన్ అధికారాలు ఇవ్వటంపై హైకోర్టులో కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్ పిల్‌ దాఖలు చేశారు. అయితే కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారాలు తీసివేయటం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన సీజే ధర్మాసనం.. వార్డ్ సెక్రటరీలతో పాటుగా సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారాలు కొనసాగుతాయని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ జరుగుతాయని ప్రమాణ పత్రం దాఖలు వేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. దీనికి సంబంధించి ధర్మాసనం నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

అయితే ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వ న్యాయవాదులు జస్టిస్ శేషసాయి, శ్రీనివాస్‌లతో కూడిన ధర్మసనం ఈనెల 14న ప్రశ్నించింది. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్ట్రార్ విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి అధికారాలు కొనసాగుతున్నాయా? లేవా? కోర్టుకు తెలిపాలంటూ ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశిస్తూ.. బుధవారానికి వాయిదా వేయగా, ఆ పిటిషన్‌పై న్యాయంస్థానం విచారించి వచ్చే నెల 1కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి