AP Elections 2024: నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి..

|

Apr 26, 2024 | 10:12 PM

ఈతరం యువతరానిదే.. ఇది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు నిడదవోలు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్తూరి సత్య ప్రసాద్. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడినా తాను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ప్రభుత్వం అందజేసే ప్రభుత్వ పథకాలన్నీ కుల,మత, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందేలా చూస్తానంటూ హామీ ఇస్తున్నారు.

AP Elections 2024: నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి..
Kasthuri Satya Prasad
Follow us on

ఈతరం యువతరానిదే.. ఇది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు నిడదవోలు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్తూరి సత్య ప్రసాద్. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడినా తాను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ప్రభుత్వం అందజేసే ప్రభుత్వ పథకాలన్నీ కుల,మత, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందేలా చూస్తానంటూ హామీ ఇస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని ఇదే తన మొదటి కర్తవ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం జన ప్రవాహం, ధన ప్రవాహం ఏరులై పారుతున్న ఈ తరుణంలో ప్రజాస్వామ్యంలో నిజాయితీగా పనిచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా యువకులు ఉత్సాహంగా ఆయన వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రాజకీయ తేరంగేట్రం..

కస్తూరి సత్యప్రసాద్ నేషనల్ ఓపెన్ స్కూల్ లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత ప్రజాసేవ పట్ల ఆకర్షితులై సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2018లో నిడదవోలు నియోజకవర్గంలో ఎర్ర విప్లవాన్ని తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను తెలుసుకునే వారు. స్మశానాలు, పారిశుద్ద్యం, డ్రైనేజీ, మంచి నీటి సమస్య, పిల్లల స్కూళ్లు, మౌళిక సదుపాయాలపై స్పందిస్తూ పోరాటాలు చేశారు. 2019లో పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందిన సత్యప్రసాద్.. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.

Kasthuri Satya Prasad

ఫాలోవర్స్ ఇలా..

సత్యప్రసాద్ ను అందరూ స్థానికంగా నాని అని పిలుచుకుంటారు. నాని లోకల్ అంటూ నినదిస్తున్నారు. నీలాంటి యువత మా అందరికి ఆదర్శం అటూ.. జనాలను సోమరులు చేసే పథకాల కన్నా.. వాళ్లు స్వసక్తిగా ఎదిగేలాగా చేసే నీ ఆలోచన గొప్పది అంటూ నానితో సాగుతున్నారు. అయితే తన వెంట నడిచే యువతకు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తారో సత్యప్రసాద్ ఒక ఎజెండా రూపంలో తెలియజేశారు. తాను నిడదవోలు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నాటినుంచి కేవలం ఆరునెలల సమయంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆరు హామీలను అమలు చేసి చూపిస్తా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

Kasthuri Satya Prasad

స్వతంత్య్ర అభ్యర్థి ఎజెండా ఇదే..

ఉమెన్ ఎంపవర్మెంట్.. ఇంటివద్ద నుంచే పనిచేసేలా మహిళలకు తోర్పాటు అందిస్తామంటున్నారు. రోజుకు రూ. 500 వరకు సంపాధించుకునేలా ఏర్పాటు చేస్తామని, మహిళ స్వశక్తితో తన కాళ్ల మీద తాను నిలదొక్కుకునేలా చేస్తామంటున్నారు.

వైద్య రంగం.. నిడదవోలు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మెరుగైన వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండేలా ప్రైమరీ హెల్త్ సెంటర్లను తీసుకొస్తామన్నారు.

విద్యారంగం.. డిగ్రీ కాలేజ్ తో పాటు ఉమెన్స్ కాలేజీలో ఉన్నత స్థాయి చదువులు అభ్యసించడం కోసం పీజీ కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. అలాగే అవసరమైనన్ని పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభిస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామంటున్నారు.

వ్యవసాయ రంగం.. రైతు సంతోషంగా ఉంటేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతున్నారు ఈ యువకుడు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నందు ధాన్యం ఆరబెట్టుకొనే కళ్లమును ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మిస్తామని చెబుతున్నారు.

పారిశ్రామిక రంగం.. ఏ ప్రాంతం అయినా అభివృద్ది చెందాలంటే పరిశ్రమలు ఎంతో కీలకం. అందుకే కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా చదువుకున్న యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు సొంత ఊళ్లోనే కల్పిచేందుకు దోహదపడతానంటున్నారు.

మౌళిక వసతులు.. దాహార్తిని తీర్చే గోదావరి నదీ జాలలను శుద్ది చేసి ప్రతి ఇంటికి మంచి నీటిని అందజేస్తామంటున్నారు. పారిశుద్ధ్యం, రోడ్లను మంచిగా తీర్చిద్దుతానంటున్నారు. పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులు, సుందర వనాలు తీసుకువస్తామని చెబుతున్నారు.

ఇలా అవసరమైనన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానంటున్నారు నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి సత్యప్రసాద్. నిత్యం ప్రజల్లో ఉండి తమకు సేవచేసే అవకాశాన్ని అందించమని ఊరూరా, వాడవాడలా తిరుగుతూ ఓటర్లను, నియోజకవర్గ ప్రజలను అర్థిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…