YS Jagan: అదే ప్రధాన ఎజెండా.. నేడు బీసీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. విజయవాడలో పర్యటన..

|

Nov 26, 2022 | 7:28 AM

పీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

YS Jagan: అదే ప్రధాన ఎజెండా.. నేడు బీసీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. విజయవాడలో పర్యటన..
AP CM YS Jagan
Follow us on

CM YS Jagan Vijayawada Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం విజయవాడ పర్యటన షెడ్యూల్.. ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.

దీంతోపాటు.. సీఎం జగన్ ఈరోజు వైసీపీ బీసీ నేతలతో క్యాంప్‌ ఆఫీస్‌లో భేటీ కానున్నారు. బీసీలకు అందిస్తున్న పథకాలపై ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. బీసీలకు పార్టీని చేరువ చేసేలా సీఎం జగన్ వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ మేరకు బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలకూ సీఎంఓ నుంచి పిలుపువచ్చింది.

ఈ భేటీకి మంత్రులు బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, గుమ్మునూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణకు కబురు అందింది. వీరితోపాటు.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, MLC జంగా కృష్ణ మూర్తి, ఎమ్మెల్యేలు పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..