CM Jagan: ఇకపై ప్రతిరోజూ ‘స్పందన’.. వారికి సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. ఎందుకంటే?

|

Aug 24, 2022 | 6:53 AM

Spandana: స్పందన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్‌ తీసుకోవద్దని స్మూత్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. జిల్లా, డివిజన్‌, సబ్‌ డివిజన్‌, మండల స్థాయిలో సోమవారం నిర్వహిస్తోన్న స్పందనలో ప్రతి అధికారి పాల్గోవాలని సూచించారు.

CM Jagan: ఇకపై ప్రతిరోజూ స్పందన.. వారికి సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. ఎందుకంటే?
Ys Jagan
Follow us on

YS Jagan Review on Spandana Program: స్పందన ప్రోగ్రామ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం జగన్‌ మరోసారి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రజల సమస్యలను అడ్రస్‌ చేయండి, అర్ధం చేసుకోండి, పరిష్కరించండి అంటూ సూచించారు. స్పందన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్‌ తీసుకోవద్దని స్మూత్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. జిల్లా, డివిజన్‌, సబ్‌ డివిజన్‌, మండల స్థాయిలో సోమవారం నిర్వహిస్తోన్న స్పందనలో ప్రతి అధికారి పాల్గోవాలని సూచించారు. ఇకపై గ్రామ, వార్డు స్థాయికి గ్రీవెన్స్‌ సెల్‌ను తీసుకెళ్లాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సచివాలయాల్లో ఆర్జీలు తీసుకోవాలంటూ సీఎం జగన్‌ డైరెక్షన్స్‌ ఇచ్చారు.

గ్రామ, వార్డు స్థాయిలో వచ్చిన కంప్లైంట్స్‌పై ప్రతి బుధవారం రివ్యూ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. గ్రామ, వార్డు స్థాయిలో స్పందన ప్రోగ్రామ్‌ కచ్చితంగా అమలు కావాల్సిందే అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌, డిజిటల్‌ లైబ్రరీస్‌, స్కూల్స్‌, హాస్పిటల్స్‌ టాప్‌ ప్రయారిటీ అంటూ చెప్పిన సీఎం జగన్‌, వాటన్నింటినీ సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్లేసెస్‌లో సమస్యలు ఉంటే, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నెంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..