AP CM YS Jagan: బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌.. కులాల వారీ జన గణన జరగాల్సిందేః ఏపీ సీఎం జగన్

AP CM YS Jagan on BC census: బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని... బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ పెట్టిన తీర్మానంపై సీఎం జగన్‌ మాట్లాడారు.

AP CM YS Jagan: బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌.. కులాల వారీ జన గణన జరగాల్సిందేః ఏపీ సీఎం జగన్
Ap Cm Ys Jagan


AP CM YS Jagan on BC census: బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని… బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో బీసీలను కూడా విభజించి పథకాలు ఇచ్చారని, తాము అర్హులందరికీ ఇస్తున్నామని చెప్పారు. బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ పెట్టిన తీర్మానంపై సీఎం జగన్‌ మాట్లాడారు. వెనుకబాటుతనం చేయాలంటే కుల గణన జరగాల్సిందేని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

దేశంలో బీసీల జనాభా 52 శాతం ఉన్నా సరియైన అవకాశాలు లేవని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవన్న సీఎం.. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని స్పష్టం చేశారు. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదన్న సీఎం.. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా స్వాలంభన సాధిచాల్సిన అవసరముందన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

భారత రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని అన్నారు. బీసీల ఎంతమంది ఉన్నారని స్పష్టత వస్తే, వారికి న్యాయం చేయగలుగుతామని అన్నారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. టీడీపీ హయాంలో ఓట్ల వారీగా కులాలను విభజించారన్న జగన్.. తమ పాలనలో అవినీతిరహిత పాలన అందిస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామన్న సీఎం.. అడుగడుగునా సామాజిక న్యాయం కనపడేలా చేశామని తెలిపారు.

టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని సీఎం జగన్‌ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. 13 మేయర్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్‌ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామని సీఎం తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu