CM Jagan: ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి జగన్ సర్కార్ శ్రీకారం.. ఆ వివరాలు మీ కోసం..

| Edited By: Ravi Kiran

Jun 15, 2023 | 9:44 AM

Andhra News: ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది జగన్‌ సర్కార్‌. ఈనెల 23 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సీఎం జగన్‌...ప్రతి ఇంటా ఏ సమస్యలు ఉన్నా...వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

CM Jagan: ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి జగన్ సర్కార్ శ్రీకారం.. ఆ వివరాలు మీ కోసం..
Andhra CM Jagan
Follow us on

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వం, ఉపాధి హామీ పనులు, హౌసింగ్‌, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు తదితర అంశాలపై సమీక్షించారు. సామాన్యుడి మొహంలో చిరు నవ్వుని చూసేందుకే ఈ ప్రయత్నం అన్నారు. ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్ష కార్యక్రమం చేప‌ట్టనుంది స‌ర్కార్. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా పత్రాలు, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తక్షణమే వాటిని పరిష్కరిస్తారు. డాక్యుమెంటేషన్‌, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు.

గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలన్నారు ముఖ్యమంత్రి.. పరిశీలించని గ్రీవెన్సెస్‌ ఏమైనా ఉంటే.. 24 గంటల్లోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. ఉపాధి హామీ కింద ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయిన‌ట్లు సీఎం చెప్పారు. జులై 8 నుంచి సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు ముఖ్యమంత్రి. సచివాలయాల స్థాయిలోనే అన్నిరకాల సేవలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..