Andhra Pradesh : ఏపీలో విద్యార్థులకు పండగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది..

|

Oct 22, 2024 | 3:47 PM

ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒకసారి మీరు సర్టిఫికెట్ తీసుకుని ఉంటే చాలు... ఆ సర్టిఫికెట్ మీకు కావాల్సినప్పుడల్లా క్షణాల్లో మీ వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. చాలా వరకు ప్రభత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా పొందే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ సర్కార్.

Andhra Pradesh : ఏపీలో విద్యార్థులకు పండగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది..
Andhra Students
Follow us on

చంద్రబాబు గవర్నెన్స్ అంటేనే డిజిటల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వాట్ చంద్రబాబు థింక్స్ టుడే.. నేషన్ థింక్స్ టుమారో అంటుంటారు ఎకనామిస్టులు. తాజాగా ఏపీ సర్కార్ మరో విప్లవాత్మక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మెటా సాయాన్ని తీసుకుంది. వాట్సప్‌ ద్వారానే విద్యార్థులకు వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించనుంది ప్రభుత్వం. ఇందుకోసం..  మెటాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇకపై మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్షణాల్లో వాట్సాప్ నుంచి పొందవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, అతి వేగంగా, పారదర్శకంగా పొందే ఏర్పాట్లు చేస్తోంది.  విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూశానన్నారు మంత్రి లోకేశ్. మొబైల్‌ ద్వారానే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని అప్పుడు హామి ఇచ్చినట్లు గుర్తు చేవారు. ఇచ్చిన హామీ మేరకు వాట్సప్‌ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, సర్వీసులు అందించేలా మెటాతో అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు.

మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సర్వీసులు వాడుకుని వాట్సప్‌ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం ఆనందకరమన్నారు మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్. పౌరులు త‌మ‌కు కావాల్సిన సేవ‌లు పొందేందుకు వీలుగా AI, వాట్సప్‌ అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ ఉంటుంద‌ని చెప్పారు. టెక్నాల‌జీని వినియోగిస్తూ.. ఏపీ సర్కార్ ద్వారా ప్రజలకు మ‌రిన్ని ఉత్తమ సేవలు అందించేందుకు ముందుంటామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..