Tomato Rate: 60 రూపాయలకే కిలో టమాటా.. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..!

| Edited By: Rajeev Rayala

Nov 27, 2021 | 8:40 AM

Tomato Rate: రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. సామాన్య జనాలను హడలెత్తిస్తున్నాయి. చికెట్, ఫిష్ రేట్లతో సమానంగా టమాటా రేట్లు పోటీ..

Tomato Rate: 60 రూపాయలకే కిలో టమాటా.. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..!
Tomato
Follow us on

Tomato Rate: రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. సామాన్య జనాలను హడలెత్తిస్తున్నాయి. చికెట్, ఫిష్ రేట్లతో సమానంగా టమాటా రేట్లు పోటీ పడుతుండటం చూసి జనాలు కంగారుపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న టమాటా ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ఫలితంగా ఇక నుంచి ధరల విషయంలో మార్పులు రానున్నాయి.

కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలుకుతోంది. ఇక రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో రేట్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. చికెన్, చేపల ధరలతో టమాటా పోటీపడుతోంది. టామాటాను వండుకోవడం దాదాపు మర్చిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగింది జగన్ ప్రభుత్వం. రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. దీంతో ప్రజలకు తక్కువ ధరకే టమాటాలు అందుబాటులోకి రానున్నాయి.

సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు అనంతపురం మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో 50 నుంచి 55 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వాటిని కడప, కృష్ణా జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. రేషన్ పద్ధతిలో ఒక్కో వినియోగదారుడికి కిలో టమాటా చొప్పున అందిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రతి రోజూ ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. భవిష్యత్తులో కనీసం వంద టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్రం కీలక ప్రకటన..
కొన్నిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో టామాట పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో టమాటాకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటాయి. అటు టమాట, ఉల్లిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. డిసెంబర్ నాటికి మార్కెట్లోకి టమాట నిల్వలు వస్తాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది కేంద్రం.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు