టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై టీడీపీ పార్టీ సస్పెన్షన్ విధించింది. షోకాజ్ నోటీసు ఇచ్చి వంశీ వివరణను కోరనుంది టీడీపీ. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వల్లభనేని వంశీ…టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మార్పింగ్‌ ఫోటోలపై సీపీకి పిర్యాదు చేసిన  వంశీ: తనపై సోషల్ మీడియా వేదికగా నెగటీవ్ ప్రచారం చేస్తున్నారని…మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని […]

  • Updated On - 12:48 am, Sat, 16 November 19 Edited By:
టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై టీడీపీ పార్టీ సస్పెన్షన్ విధించింది. షోకాజ్ నోటీసు ఇచ్చి వంశీ వివరణను కోరనుంది టీడీపీ. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వల్లభనేని వంశీ…టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

మార్పింగ్‌ ఫోటోలపై సీపీకి పిర్యాదు చేసిన  వంశీ:

తనపై సోషల్ మీడియా వేదికగా నెగటీవ్ ప్రచారం చేస్తున్నారని…మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వంశీ విజయవాడ సీపీకి పిర్యాదు చేశారు. టీడీపీ సంబంధించిన కొందరి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయని, కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు వంశీ. ఇటువంటి పనులు చేస్తున్న ఇళ్లలో కూడా ఆడవారు ఉంటారని..దమ్ముంటే  స్ట్రయిట్‌గా వచ్చి ఢీకొట్టాలని వంశీ పేర్కొన్నారు.

వంశీ ఆరోపణలపై స్పందించిన లోకేశ్: 

ఇక వంశీ చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైరయ్యారు. వంశీ చెబుతున్న వెబ్‌సైట్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. నిన్నటి వరకు జగన్‌ను తిట్టిన వంశీ ఇవాళ అదే పార్టీలోకి వెళ్లడం వెనక ఏం కోణాలున్నాయని ప్రశ్నించారు.  ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పార్టీ మారిన వారు చేసే.. ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నారా లోకేశ్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం తనను కలిసి అనుచరుల నుంచి ఒత్తిడి వస్తుందని  చెప్పిన వంశీ..ఇప్పుడు స్వరం మార్చడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 2009 నాటి జూనియర్ ఎన్టీఆర్ విషయం ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారో చెప్పాలన్నారు.