New Pension Cards : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు..

|

Feb 17, 2020 | 7:15 AM

New Pension Cards :  ఇటీవలే కొత్త రేషన్ కార్డులు పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త కార్డులను పంపిణీ చేయబోతుంది. ఏపీలో అన్ని రకాల పెన్షన్‌లు కలుపుకోని  ఫిబ్రవరి వరకు మొత్తం 54,68,322 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరందరికి సోమవారం(ఫిబ్రవరి 17) నుంచి ఫిబ్రవరి 20 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో కొత్తగా పెన్షన్‌కు అనుమతి లభించినవారికి పెన్షన్ బుక్‌తో పాటు […]

New Pension Cards : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు..
Follow us on

New Pension Cards :  ఇటీవలే కొత్త రేషన్ కార్డులు పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త కార్డులను పంపిణీ చేయబోతుంది. ఏపీలో అన్ని రకాల పెన్షన్‌లు కలుపుకోని  ఫిబ్రవరి వరకు మొత్తం 54,68,322 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరందరికి సోమవారం(ఫిబ్రవరి 17) నుంచి ఫిబ్రవరి 20 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.

ఈ నెలలో కొత్తగా పెన్షన్‌కు అనుమతి లభించినవారికి పెన్షన్ బుక్‌తో పాటు ఐడెంటిటి కార్డు కూడా ఇవ్వనున్నారు. పాత పెన్షన్‌దారులందరికి గతంలోనే పెన్షన్ పుస్తకాలు అందజేసిన నేపథ్యంలో వారికి గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు. ఇక చాలామంది పెన్షన్లు తీసివేశారని ఇటీవల అలజడి చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఎం జగన్ కీలక మార్గనిర్దేశకాలు విడుదల చేశారు. మరోసారి రీ సర్వే జరిపి, అర్హులైన వారిని తొలిగించినట్లయితే..వారిని తిరిగి జాబితాలో చేర్చి.. వచ్చే నెల రెండు నెలల పెన్షన్ కలిపి ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రొసెస్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసింది. పెన్షన్ బుక్‌, గుర్తింపు కార్డుల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే గ్రామ లేదా వార్డు వాలంటీర్లను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.