Breaking.. బస్సులు, మెట్రో బంద్..

|

Mar 21, 2020 | 3:18 PM

Janata Curfew: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈ రాత్రి నుంచే నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక […]

Breaking.. బస్సులు, మెట్రో బంద్..
Follow us on

Janata Curfew: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

అటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈ రాత్రి నుంచే నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కూడా దీనికి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ఏపీలో ఇప్పటికే పెట్రోల్ బంకులు మూసివేయాలని నిర్ణయించగా.. తెలంగాణలో పెట్రోల్ బంకులు మూసివేతపై చర్చించేందుకు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. కాగా, పలు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటికే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఇక అదే బాటలో తెలంగాణలో కూడా మెట్రో రైళ్లను రేపు నిలిపివేస్తున్నట్లు ఎండీ ఎన్వీయేస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్ ను కూడా మూసివేస్తున్నామని స్పష్టం చేశారు.  ఇక మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో టీఎస్ఆర్టీసీ బంద్‌పై అధికారిక ప్రకటన రానుంది.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్