ఏబీకి.. ఏసీబీ డీజీగా ‘కీ’ పోస్ట్

|

Apr 22, 2019 | 5:22 PM

అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నరసింహన్ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంతకముందు ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనను సోమవారం ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన […]

ఏబీకి.. ఏసీబీ డీజీగా కీ పోస్ట్
Follow us on

అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నరసింహన్ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంతకముందు ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనను సోమవారం ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూరే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.