శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయితీలోని అక్కువరం సీతాపురం గ్రామం ఓప్రత్యేకమైంది. A. సీతాపురం.. ఈ గ్రామం పేరు వినటానికి ఎంత అందంగా ఉందో.. దాని గురించి తెలిస్తే మాత్రం అంతకు మించి టెర్రర్. అక్కువరం సీతాపురం గ్రామo వెళ్ళటానికి దారి ఎటు అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎవరైనా అడిగితే చాలు వారంతా గజగజ వణికి పోతారు.ఇదంతా ముప్ఫై ఏళ్ల కిందటిదే అయినా ఆ గ్రామ పొలిమేరల్లోకి వెళ్లాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇప్పటికీ సుస్సుపోసుకుంటారు. ఇప్పటికీ ఆ గ్రామం ముఖం కూడా చూడరు.A. సీతాపురం వెళ్లాలంటే తిరుచనాపల్లి అనే గ్రామం నుండి కిలో మీటరున్నర దూరం కాలినడకన వెళ్ళాలి.
ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
ఒకప్పుడు ఈ గ్రామం నివాసాలతో కలకలాడుతూ ఉండేది. తాగునీరు,సాగునీటికి ఇక్కడ కొదవలేదు. సారవంతమైన పంట పొలాలు. గ్రామాన్ని అనుకొని పర్వతాలు. ఎటు చూసినా ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయత. ఈ గ్రామంలో పిల్ల పాపలతో దాదాపు 30 కుటుంబాలు జీవనం కొనసాగించేవి. కానీ ఇదంతా ముప్పై ఏళ్ల కిందటి మాట. ప్రస్తుతం ఆ పర్వతాలు, నీటి వసతి,సారవంతమైన భూములు అలాగే ఉన్నాయి కానీ గ్రామంలో మాత్రం పిట్ట మనిషి లేరు. అక్కడి నివాసాలు కూడా పూర్తిగా శిథిలమై పోయాయి. దట్టమైన తోటలతో ఓ అడవిని తలపించేలా,నిర్మానుష్యంగా గ్రామం మారిపోయింది. గ్రామంలో దెయ్యాలు ఉన్నాయన్న భయం ఆ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించేసింది.
ఆ గ్రామం గురించి చుట్టుపక్కల ఏ గ్రామస్తుల్ని అడిగిన ఆ గ్రామంలోని దెయ్యాల గురించి కథలు కథలుగా చెబుతారు. ఇప్పటికీ ఆ గ్రామంలో చెట్ల కొమ్మలు ఊగటం, వింత వింత శబ్దాలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయని చెబుతారు. అమావాస్య వంటి రోజుల్లో అటువైపు నుండి మరింత పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని అంటున్నారు.అందుకే మనుష్యులే కాదు కనీసం మేత కోసం వెల్లే పశువుల్ని సైతం అటువైపు వెళ్ళనీయరు సమీప గ్రామస్తులు. అప్పట్లో గ్రామంలో ఓ ఇద్దరు వ్యక్తులు చెట్టుకు ఉరివేసుకొని చనిపోయారు. తర్వాత క్రమంలో వివిధ కారణాలవల్ల గ్రామంలో వేరు వేరు సందర్భాలలో పదిమంది వరకు గ్రామంలోని వారు చనిపోయారు. దీనికి తోడు చెట్లపై నుంచి మట్టి, రాళ్లు, గాజులు వంటివి పడటం జరిగేవట. జుట్టు విరబోసుకుంటూ వింత ఆకారంలో మహిళ కనిపించేదని. మరికొందరు ఏ ఆకారం కనిపించకుండా దగ్గరగా ఎవరో సమీపిస్తున్నట్లు శబ్దాలు వచ్చేవని ఇలా చుట్టుపక్కల గ్రామాలలోని అప్పటి వారు ఎవరికి తోచిన అనుభవాలను వారు చెబుతూ ఉంటారు.
మొత్తానికి దెయ్యం పేరుతో గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. అయితే అప్పట్లో అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తుండేవి, అందుకు తగ్గ వైద్యం అందుబాటులో ఉండేది కాదు.మరోవైపు ప్రజల నిరక్షరాస్యత, అమాయకత్వం అప్పటివారిని మూఢనమ్మకాలవైపుగా ప్రోత్సహించేవి. ఈ బలహీనతలే దెయ్యం పేరుతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసి ఉండవచ్చన్న వాదన నేటి తరంలోని కొద్దిమంది నుండి వ్యక్తం అవుతోంది. దీనికి తోడు అక్కడి భూములపై కన్నేసిన భూస్వాములు అమాయకులైన గ్రామస్తులను దెయ్యం పేరుతో భయభ్రాంతులకు గురి చేసి ఉండవచ్చన్న వాదన లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక గ్రామాలు ప్రజలను చైతన్యం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.