Adulterated Ghee: బయట నెయ్యి కొంటున్నారా? జర జాగ్రత్త లేకుంటే..ఇలానే..

|

Nov 03, 2024 | 12:58 PM

అప్పట్లో నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్లు.. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ఆహార పదార్థులు కల్తీ అయ్యాయి. వ్యాపారులు డబ్బులు సంపాదించడానికి ఏం చేయడానికైనా వెనుకాడం లేదు. తాజాగా అలాంటి ఘటన ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

Adulterated Ghee: బయట నెయ్యి కొంటున్నారా? జర జాగ్రత్త లేకుంటే..ఇలానే..
Adulteration Ghee In Nandya
Follow us on

భారతదేశంలో పూర్వం నుంచి నెయ్యిని తినడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. నెయ్యిని తింటే దృఢంగా, బలంగా ఉంటారని చిన్నప్పుడు మనకు పెద్దలు చెబుతూ ఉండడం మనం చూసి ఉంటాం.. పాతకాలంలో ఈ నెయ్యిని ఇంట్లోనే చేసుకునేవాళ్లు.. అలా అయితే కల్తీ జరిగే ఛాన్స్ లేదు. కానీ ఈ మధ్యకాలంలో కల్తీ నెయ్యి మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ నెయ్యి తింటే ఆరోగ్యం మాట దేవుడెరుగు..లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటాం..

నంద్యాల జిల్లాలో నందికొట్కూరు మండలంలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి తయారీపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల కార్డెన్ సెర్చ్ పేరుతో ఆకస్మిక తనిఖీలు దాడులు చేపట్టారు. 30 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్తీ నెయ్యిలో ఏమేమి వాడారు? ఎక్కడెక్కడ విక్రయించారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కల్తీ నెయ్యి వంటి అసాంఘిక కార్యకలాపాలు చేపడితే సహించదిలేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి