Andhra Pradesh: గన్నవరంలో గరం గరం పాలిటిక్స్.. వంశీకి వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత.. ఏ విషయంలోనంటే..!

|

Jun 14, 2022 | 6:02 AM

Andhra Pradesh: గన్నవరంలో ఒకే పార్టీ నేతల వైరంతో.. ఇప్పటికే గరం గరం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సీన్‌లోకి జనసేన ఎంట్రీ ఇచ్చింది.

Andhra Pradesh: గన్నవరంలో గరం గరం పాలిటిక్స్.. వంశీకి వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత.. ఏ విషయంలోనంటే..!
Gannavaram
Follow us on

Andhra Pradesh: గన్నవరంలో ఒకే పార్టీ నేతల వైరంతో.. ఇప్పటికే గరం గరం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సీన్‌లోకి జనసేన ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ వివాదంలో జనసేన తలదూర్చాల్సిన అవసరమేంటి? ఇంతకీ అక్కడ పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గన్నవరం వైసీపీలో రచ్చ మరో మలుపు తిరిగింది. ఇన్ని రోజులూ వైసీపీకి చెందిన ముగ్గురు నేతల మధ్యే వార్ నడిచింది. ఎమ్మెల్యే వంశీ, యార్లగడ్డ, దుట్టా.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు సీన్‌లోకి సరికొత్తగా జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేన లోకల్ లీడర్ చలమలశెట్టి రమేష్.. ఎమ్మెల్యే వంశీకి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్. జనసైనికులకు ఎమ్మెల్యే వంశీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన. లేదంటే హనుమాన్ జంక్షన్‌లో వంశీని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వంశీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

జనసేన నాయకులకు.. వైసీపీ నేత దుట్టా డబ్బులు ఇచ్చారని మీడియా ముందు మాట్లాడటంపై జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలో యార్లగడ్డ రెండు కోట్లు ఇవ్వాలని చుస్తే వద్దని వదిలేసాననీ.. తాను అమ్ముడుపోయే మనిషిని కాదన్నారు. జనసైనికులను అవమానించిన వంశీ వెంటనే క్షమాపణ చెప్పాలని చలమలశెట్టి రమేష్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

గన్నవరంలో మొదటి నుంచీ వైసీపీలో తీవ్ర స్థాయిలో వర్గపోరు నడుస్తోంది. కొన్ని రోజులుగా మీడియాలోకి వచ్చి మరీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో.. పార్టీకి తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తమదంటే తమదంటూ… పోటా పోటీ ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ వంశీకి టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని యార్లగడ్డ, దుట్టా తేల్చి చెప్పారు. ఇలా గన్నవరం పంచాయితీ టన్నుల కొద్దీ పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. ఒకరిపై మరొకరు వ్యక్తిగత స్థాయిలో చేసుకుంటున్న ఈ విమర్శలు చివరికి ఎటు దారితీస్తాయోననిఇ పార్టీ అధిష్టానం ఆందోళనతో ఉంది. మరి గన్నవరం గరం పంచాయితీకి ఎండ్ కార్డ్ ఎప్పుడు? తేలాల్సి ఉంది.