తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరంలోని దివాన్ చెరువు వద్ద ఓ లారీలో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టిస్తుండగా లారీ ఇంజన్ నుండి మంటలు వచ్చాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో బంక్‌లో ఉన్న వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. బంక్లో ఉన్న గ్యాస్ సిలండర్లతో హుటాహుటిన కొందరు అదుపుచేసిన మంటలు ఆగలేదు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఏ ప్రమాదం జరగకపోవడంతో వాహనదారులు, బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.