AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే..

అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో భారీ గిరినాగు కలకలం సృష్టించింది. రెండు ఇళ్ల గోడల మధ్య సుమారు 13 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా.. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు రంగంలోకి దిగి సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు.

గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే..
King Cobra Rescue
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 7:18 AM

Share

అనకాపల్లి జిల్లాలో మరో భారీ కలకలం సృష్టించింది. ఇంటి ప్రహారికి, గోడకు మధ్య వచ్చి చేరింది. అక్కడే ఉన్న ఇంటి పనులు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులకి.. ఇందులో ఏదో వెళ్తున్నట్టు గుర్తించారు. కింగ్ కోబ్రాన్ని చూసి హడలెత్తిపోయారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గరిసింగి గ్రామంలో ఈ భారీ కింగ్ కోబ్రా కనిపించింది. సుమారు 13 అడుగుల పొడవుగల భారీ గిరినాగు.. రెండు ఇళ్ల గోడల సందులోకి వచ్చి చేరింది. పాము అక్కడే ఉందనే సంగతి తెలియని స్థానికులు.. అక్కడున్న ఇటుకల కోసం వెళ్లారు. అదే సమయంలో సందులో దూరుతున్న గిరినాగును చూసి హడలిపోయారు.

వణికి పోయిన స్థానికులు.. వెంటనే.. చోడవరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు.. ఆ సమాచారాన్ని తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు చేరేవేశారు. దీంతో తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు ప్రసాద్, కృష్ణ, ఇషాక్ గరిసింగి గ్రామానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి భారీ గిరినాగును రెస్క్యూ చేశారు. అనంతరం ఆ గిరినాగును చీడికాడ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

అయితే.. రెస్క్యూ చేసే క్రమంలో.. గిరినాగు పెద్దగా బుసలు కొడుతూ.. స్నేక్ క్యాచర్‌ల పైనే తిరగబడింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us