కూలింగ్ వాటర్ క్యాన్ తో లిక్కర్ సఫ్లై..!

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కృష్ణాజిల్లా అధికారులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం లోని శివసాయి హోటల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో తక్కువ ధరకు లిక్కర్ దొరుకుతుండడంతో కూలింగ్ వాటర్ క్యాన్ లో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 135 మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ ఆటో, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. […]

కూలింగ్ వాటర్ క్యాన్ తో లిక్కర్ సఫ్లై..!
Follow us

|

Updated on: May 30, 2020 | 7:34 PM

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కృష్ణాజిల్లా అధికారులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం లోని శివసాయి హోటల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో తక్కువ ధరకు లిక్కర్ దొరుకుతుండడంతో కూలింగ్ వాటర్ క్యాన్ లో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 135 మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ ఆటో, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచే అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు కృష్ణాజిల్లా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. అన్ని రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 956 కేసులు నమోదు చేశామన్నారు.. ఇందుకు సంబంధించి 1428 మంది నిందితులను అరెస్టు చేశామన్నా ఎస్పీ.. వీరిలో ఆరుగురు పోలీసులపై కూడా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని రవీంద్రనాథ్ హెచ్చరించారు.

Latest Articles