జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఐపీఎస్ అధికారి సస్పెండ్‌

టీడీపీ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఐపిఎస్ అధికారి ఎ బి వెంకటేశ్వర రావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉంచారు. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ […]

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఐపీఎస్ అధికారి సస్పెండ్‌
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 2:07 AM

టీడీపీ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఐపిఎస్ అధికారి ఎ బి వెంకటేశ్వర రావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉంచారు. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి.