కాశ్మీర్ పై అమెరికా అదే పాట.. ఆంక్షలు ఎత్తివేయాల్సిందే !

| Edited By:

Oct 16, 2019 | 4:51 PM

జమ్మూకాశ్మీర్ లో విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని అమెరికా.. భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు మధ్యవర్తిత్వం వహించేందుకు అధ్యక్షుడు ట్రంప్ సిధ్ధంగా ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల అధికారి అలీస్ వెల్స్ తెలిపారు. ట్రంప్ ఈ వారంలో భారత, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ ఖాన్ లతో వేర్వేరుగా సమావేశమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షల పట్ల తమ దేశం ఆందోళన చెందుతోందని, […]

కాశ్మీర్ పై అమెరికా అదే పాట.. ఆంక్షలు ఎత్తివేయాల్సిందే !
Follow us on

జమ్మూకాశ్మీర్ లో విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని అమెరికా.. భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు మధ్యవర్తిత్వం వహించేందుకు అధ్యక్షుడు ట్రంప్ సిధ్ధంగా ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల అధికారి అలీస్ వెల్స్ తెలిపారు. ట్రంప్ ఈ వారంలో భారత, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ ఖాన్ లతో వేర్వేరుగా సమావేశమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షల పట్ల తమ దేశం ఆందోళన చెందుతోందని, మొదట ఆ రాష్ట్రంలో ఆంక్షలను ఎత్తివేయాల్సిందేనని అలీస్ కోరారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని గత ఆగస్టులో రద్దు చేసిన కేంద్రం.. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి రాజకీయ నేతలను, ఇంకా పలువురిని అరెస్టు చేయించింది. ఇప్పటికీ వీరు గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు. అలాగే నెల రోజులకు పైగా ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ వంటి వాటిపై ఆంక్షలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఈ పరిణామాల పట్ల తమ దేశం ఆందోళన చెందుతోందని అలీస్ పేర్కొన్నారు. కాశ్మీర్లోని స్థానిక నాయకులతో భారత ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నట్టు ఆమె చెప్పారు. ‘ ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచ దేశాలకు ఎంతో ప్రయోజనకరం.. పైగా దీనివల్ల ఉభయ దేశాల మధ్య చర్చలు జరగడానికి ఇది దోహదపడుతుంది కూడా ‘ అని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ ముందుకు వచ్చారని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీరును కూడా ఆమె దుయ్యబట్టారు. కాశ్మీర్ పై ఖాన్ వ్యాఖ్యలు ఉభయ దేశాల మధ్య సౌహార్దతకు దోహదపడవని అన్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మంచిది కాదని చెప్పిన అలీస్.. అసలు చైనా గురించి మీరెందుకు మాట్లాడడం లేదని ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు. టర్కీ భాష మాట్లాడే లక్షలాది మంది ముస్లిములను చైనా నిర్బంధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పశ్చిమ చైనాలో ఇలా అనేకమంది ముస్లిములు నిర్బంధంలో ఉన్నారని అలీస్ పేర్కొన్నారు.