Plane Crash Video: అమెరికా డాలస్‌ ఎయిర్‌షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు యుద్ద విమానాలు.. వీడియో చూస్తే షాకవుతారు..

|

Nov 13, 2022 | 8:25 AM

అమెరికాలోని టెక్సాస్‌లో ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటన టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో జరిగిన వైమానిక ప్రదర్శనలో జరిగింది.

Plane Crash Video: అమెరికా డాలస్‌ ఎయిర్‌షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు యుద్ద విమానాలు.. వీడియో చూస్తే షాకవుతారు..
Mid Air Plane Crash In Dall
Follow us on

అమెరికా డాలస్‌లో ఎయిర్‌షోలో రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొని పేలిపోయాయి. శకాలాలు ఎయిర్‌ఫీల్డ్‌ మీద పడ్డాయి.. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నారు.. వీరంతా చనిపోయేఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేదు..ఘటనా స్థలానికి సహాయక సిబ్బంది పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన బోయింగ్ B-17 ఫ్లయింగ్, బెల్ P-63 కింగ్‌కోబ్రా యుద్ద విమానాలు రెండో ప్రపంచ యుద్దం నాటివని అధికారులు చెబుతున్నారు.. ఎయిర్‌ ఫీల్డ్‌లో మంటలు, ఆకాశంలో నల్లటి పొగలు వ్యాపించడంతో ఎయిర్‌షోను చూసేందుకు వచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యారు.. తమ కళ్ల ముందే జరిగిన ఈ ప్రమాదాన్ని చూసి షాకింగ్‌కు గురయ్యారు.

ఏం జరిగిందంటే..

అమెరికాలోని టెక్సాస్‌లో ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటన టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో జరిగిన వైమానిక ప్రదర్శనలో జరిగింది. పాతకాలపు సైనిక విమానాలుగా గుర్తించారు. ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో పాతకాలపు ఎయిర్ షో జరుగుతోంది. ఒక బోయింగ్ B-17 గాలిలో విన్యాసాలు చేస్తోంది, అకస్మాత్తుగా బెల్ P-63 అనే మరో విమానం ఈ విమానం సమీపంలోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకముందే రెండు విమానాలు ఢీ కొన్నాయి.

40కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. శిథిలాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి. రెండు విమానాల్లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు కూడా ప్రమాదంలో మరణించారు.

ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అనేక వీడియోలలో, రెండు విమానాలు గాలిలో ఢీకొన్నట్లు కనిపిస్తున్నాయి. రెండు విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా, ఒక్కసారిగా అవి ఒకదానికొకటి ఢీకొనడంతో ఆకాశంలోకి నల్లటి పొగలు వ్యాపించాయి. FAA మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం