చైనీస్ కంపెనీ ‘ఆలీబాబా’కు గుర్ గావ్ కోర్టు సమన్లు

చైనీస్ కంపెనీ 'ఆలీబాబా'కు, దాని ఫౌండర్ జాక్ మా కు గుర్ గావ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని ఈ సమన్లు..

చైనీస్ కంపెనీ 'ఆలీబాబా'కు గుర్ గావ్ కోర్టు సమన్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 4:14 PM

చైనీస్ కంపెనీ ‘ఆలీబాబా’కు, దాని ఫౌండర్ జాక్ మా కు గుర్ గావ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని ఈ సమన్లు జారీ అయ్యాయి. ‘ఆలీబాబా’ ఆధ్వర్యంలోని యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ తో బాటు మరో 57 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. తమ సంస్థ కొన్ని వార్తలను సెన్సార్ చేస్తోందని, ఫేక్ న్యూస్ ఇస్తోందంటూ మాజీ ఉద్యోగి పుష్పేంద్ర సింగ్ పార్మర్..గుర్ గావ్ కోర్టుకెక్కారు. సెన్సార్ షిప్, ఫేక్ న్యూస్ కంటెంట్ కి అభ్యంతర పెట్టినందుకు తనను జాబ్ నుంచి తొలగించారని, తనకు సుమారు 2 కోట్ల పరిహారం ఇచ్ఛేలా ఆదేశించాలని పార్మర్ కోరారు. చైనాకు అనుకూలంగా లేని సమాచారాన్ని సెన్సార్ చేస్తున్నారని, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ తప్పుడు వార్తలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు.

2017 అక్టోబరు వరకు ఈయన గుర్ గావ్ లో ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టరుగా పని చేశారు. ఈయన పిటిషన్ ని పురస్కరించుకుని గుర్ గావ్ జిల్లా కోర్టు.. ఆలీబాబాకు, జాక్ మాకు, మరో 12 కంపెనీ యూనిట్లకు నోటీసులు జారీ చేస్తూ..ఈ నెల 29 న మీరుగానీ, మీ లాయర్ గానీ కోర్టులో హాజరు కావాలని కోరింది. పైగా 30 రోజుల్లోగా మీ లిఖితపూర్వక స్పందన తెలియజేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

Latest Articles