సాయుధ ద‌ళాల సిబ్బందికి.. ఎయిర్‌ఏషియా ఇండియా బంపర్ ఆఫ‌ర్‌!

ఎయిర్‌ఏషియా ఇండియా సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణ కాలానికి సాయుధ దళాల సిబ్బందికి బేస్ ఛార్జీలు లేకుండా 50,000 సీట్లు కేటాయించింది. ఆఫ‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌నుకునేవారు

సాయుధ ద‌ళాల సిబ్బందికి.. ఎయిర్‌ఏషియా ఇండియా బంపర్ ఆఫ‌ర్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 8:56 PM

ఎయిర్‌ఏషియా ఇండియా సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణ కాలానికి సాయుధ దళాల సిబ్బందికి బేస్ ఛార్జీలు లేకుండా 50,000 సీట్లు కేటాయించింది. ఆఫ‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌నుకునేవారు ఆన్‌లైన్‌లో త‌మ వివ‌రాల‌ను ఈ నెల 15 నుంచి 21వ తేదీలోగా న‌మోదు చేసుకోవాలని పేర్కొంది. “రెడ్‌పాస్” ఆఫర్ కింద బేస్ ఛార్జీలు మాఫీ చేయగా, విమానాశ్రయ ఫీజులు, ఛార్జీలు, పన్నులు వారు భ‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. దరఖాస్తు పరిశీలిన ఒక‌సారి పూర్తైతే ఎయిర్‌ ఏషియా ఇండియా నడుపుతున్న ఏదైనా దేశీయ విమానంలో వారు ప్ర‌యాణించ‌వ‌చ్చంది.

ఎయిర్ ఏషియా రెడ్‌పాస్ వన్-వే ప్ర‌యాణానికి మాత్ర‌మే చెల్లుబాటు అవుతుంది. దీని కోసం బయలుదేరే తేదీకి కనీసం 21 రోజుల ముందు రిజర్వేషన్లు చేయవలసి ఉంటుందని తెలిపింది. బేస్ ఛార్జిల త‌గ్గింపుతో పాటు బోర్డింగ్‌, చెన్ ఇన్ ల‌గేజీ డిపాజిట్‌, త‌క్కువ ధ‌ర‌కే క్యారియ‌ర్ వంటి స‌దుపాయాలు ఉంటాయంది. ఇండియ‌న్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌గార్డ్‌, పారామిల‌ట‌రీ సిబ్బంది, ట్రైనీ క్యాడెట్లు ఈ ఆఫ‌ర్‌కు అర్హులని తెలిపింది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!

Latest Articles