Chinese Spies : చైనా గూఢచారులను విడిచిపెట్టిన అఫ్గానిస్తాన్.. ఆ రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం..

ప్రపంచ వ్యాప్తంగా చైనా గూఢచారులను ఏర్పాటు చేసుకుంది. తమ గూఢచారుల ద్వారా ఆయా దేశాల రహస్య సమాచారాన్ని సేకరిస్తోంది. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్లో గత డిసెంబర్‌ 10న పట్టుబడిన డ్రాగెన్‌ గూఢచారులను....

Chinese Spies : చైనా గూఢచారులను విడిచిపెట్టిన అఫ్గానిస్తాన్.. ఆ రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 4:55 PM

Chinese Spies : ప్రపంచ వ్యాప్తంగా చైనా గూఢచారులను ఏర్పాటు చేసుకుంది. తమ గూఢచారుల ద్వారా ఆయా దేశాల రహస్య సమాచారాన్ని సేకరిస్తోంది. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్లో గత డిసెంబర్‌ 10న పట్టుబడిన డ్రాగెన్‌ గూఢచారులను తాజాగా విడుదల చేసింది. చైనా విజ్ఞప్తి చేయడంతో వెంటనే వారిని ప్రత్యేక విమానంలో చైనాకు తరలించింది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేసింది చైనా.

విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారం ఇవ్వడంతో అంతా బయటకు పొక్కింది. పట్టుబడిన వారంతా కాబూల్‌లో ఉగ్రచర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించారని ముందుగా అఫ్గాన్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా తమకు క్షమాణ చెప్పాల్సిందేనని.. లేదంటే నిందితులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో అఫ్గాన్‌ అధికారులతో చైనా‌ రహస్యంగా చర్చలు జరిపింది. తమ గుఢచారులను వెనక్కి తెప్పించుకున్నట్లుగా సమాచారం. ఏ షరతుల మేరకు వీరిని విడుదల చేశారు.. వారిని విడిపించుకునేందుకు ఏటువంటి మార్గాన్ని చైనా అనుసరించింది.. అనే ప్రశ్నలకు జవాబు లభించలేదు.

గత డిసెంబరు 10న అఫ్గానిస్థాన్‌‌ నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ జరిపిన దాడుల్లో 10 మంది చైనీయులు పట్టుబడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అఫ్గాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ చేపట్టిన తర్వాత అక్కడ పట్టుకోసం చైనా ప్రయత్నిస్తోంది. గూఢచార, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపుతోంది. తాజాగా పట్టుబడిన 10 మంది చైనీయులకు ఉగ్రవాద సంస్థ హుక్కానీతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో అఫ్గాన్‌ అప్రమత్తమైంది.

ఈ కేసు బాధ్యతలను ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌కు అప్పగించాలని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నిర్ణయించారు. ఆయన గతంలో అఫ్గనిస్థాన్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా పని చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న సున్నితత్వం దృష్ట్యా చైనాతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ చర్చల మేరకే చైనీయులను విడుదల చేయాలని అఫ్గాన్ ప్రభుత్వం‌ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు మనిస్తున్నాయి.