అందుకే ద్ర‌విడ్ ను.. గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ అనేది..!

టెస్టు క్రికెట్ లో ప్ర‌పంచ అత్యుత్తమ ఆట‌గాళ్ల‌లో భారత మాజీ ప్లేయ‌ర్ రాహుల్​ ద్రవిడ్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు​. ఎంతోకాలం భార‌త క్రికెట్ కు సేవ‌లందించిన గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్... ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లు ఆడారు.

అందుకే ద్ర‌విడ్ ను.. గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ అనేది..!
Follow us

|

Updated on: Jul 11, 2020 | 11:30 PM

టెస్టు క్రికెట్ లో ప్ర‌పంచ అత్యుత్తమ ఆట‌గాళ్ల‌లో భారత మాజీ ప్లేయ‌ర్ రాహుల్​ ద్రవిడ్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు​. ఎంతోకాలం భార‌త క్రికెట్ కు సేవ‌లందించిన గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్… ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లు ఆడారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​లో ఆయన పేరిట ఉన్న ఓ రికార్డును శనివారం ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది ఐసీసీ.

“31,258 – టెస్టు క్రికెట్​లో రాహుల్​ ద్రవిడ్​ ఆడిన‌ బంతులు. ఇప్పటివరకు ఏ ఆట‌గాడు కనీసం 30వేల బంతుల‌ను ఎదుర్కొలేక‌పోయారు . ప్రతీ టెస్టులో సగటున 190.6 బంతులు ఆడేవారు ద్రవిడ్” అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.

1994 నుంచి 2012 వరకు భార‌త‌ క్రికెట్​కు సేవ‌లందించారు ద్రవిడ్​. మొత్తం 164 టెస్టులు ఆడారు. ఆయన కన్నా మరో నలుగురు టాప్​ బ్యాట్స్​మన్​ ఎక్కువ మ్యాచ్​లు ఆడినా… ఎవరూ ​ ద్రవిడ్​​ అన్ని బంతులు ఎదుర్కొనలేదు.​ సచిన్​ ​ 200 టెస్టులు ఆడి 29,437 బంతులు ఆడారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్​ కలిస్​ 166 మ్యాచ్​లు ఆడి 28,903 బంతులు ఎదుర్కొన్నారు. విండీస్​ మాజీ ప్లేయ‌ర్ ఎస్​.చంద్రపాల్​ 27,395, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్​ బోర్డర్​ 27,072 డెలివరీలు​ ఎదుర్కొన్నారు.