Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • జూనియర్ ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ ఫై హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ మీరా చోప్రా జూనియర్ ఎన్ఠీఆర్ ఎవరో తెలియదు అని ఇన్స్ట్రగామ్ లైవ్ లో చెప్పిన మీరాచోప్రా అసభ్యపదజాలం తో మీరాచోప్రా కు మేసేస్స్ లు పోలీసులకు ఆన్లైన్ లో ఫిర్యాదు చేసిన మీరాచ్చోప్రా
  • అగ్రరాజ్యంలో అగ్గి: ఫ్లాయిడ్‌ హత్యపై ఎగసిన నిరసన, అల్లర్లతో అమెరికాలో అల్లకల్లోలం, పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురు మృతి, 150 నగరాల్లో కర్ఫ్యూ 13 నగరాల్లో ఎమర్జెన్సీ విధింపు, అల్లర్ల అదుపుకు 67 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌, అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రంప్‌ జాత్యహంకార ధోరణి
  • ముంబైపై నిసర్గ పడగ: వంద సంవత్సరాల తర్వాత ముంబై మహానగరానికి అతి తీవ్ర తుఫాన్‌ నిసర్గ ముప్పు, తీర ప్రాంతాల్లో రాకపోకలపై నిషేధం, 6 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న అలలు, గంటకు 110 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు, నేటి మధ్యాహ్నానికి తుఫాన్‌ తీరం దాటే అవకాశం
  • హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత . 70 గ్రాముల కొకెయిన్ పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు . తిరుమలగిరి లో తరుణ్ , అమిత్ లను పట్టుకున్న అధికారులు . మాస్క్ లకోసం బెంగుళూర్ కు ఇంటర్స్టెట్ పాస్ తో వెళ్లిన యువకులు . బెంగుళూర్ లో నైజీరియన్ దగ్గర కోకయున్ తెచ్చుకున్న యువకులు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియో విడుదల

43 farmers committed suicide Rs 14.58 crore teleased as ex gratio to kin, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియో విడుదల" srcset="https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/suicide-new.png 780w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/suicide-new-300x180.png 300w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/suicide-new-768x461.png 768w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/suicide-new-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడ్డ 243 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.14.58 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాల్లో మొత్తం 243 మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారు. పంట నష్టాల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించే సంకల్పంతో ఈ నిధులను విడుదల చేసింది.

మృతిచెందిన రైతుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వీరి లిస్టును తయారుచేశారు. మొత్తం 243 మంది రైతు కుటుంబాలకు ఈ ఆర్థికసాయాన్ని అందించనున్నారు. రాష్ట్రంలోగల 24 జిల్లాల్లోకెల్లా నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియో నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Tags