యువతతో పెద్దలకు తీవ్ర ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

| Edited By:

Aug 28, 2020 | 7:59 AM

యువతకు కరోనా సోకితో, అది వారి ఇళ్లలోని పెద్ద వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

యువతతో పెద్దలకు తీవ్ర ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
Follow us on

WHO warns on Corona: యువతకు కరోనా సోకితో, అది వారి ఇళ్లలోని పెద్ద వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అంతేకాదు మరణాలు పెరిగే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. కరోనా సుడిగాలి లాంటిది అని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగే వెల్లడించారు. ”దీనిపై అనవసరమైన అంచనాలను వేయాలనుకోవడం లేదు. కానీ యువత వలన పెద్దలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. వారి వలన ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల రేటు రెండూ పెరుగుతున్నాయి” అని ఆయన తెలిపారు.

యూరోపియన్ ప్రాంతంలోని 55 రాష్ట్రాలు, టెర్రిటోరీస్‌ ప్రదేశాల్లోని 32 ప్రాంతాల్లో 14 రోజుల్లో మరణాల రేటు 10 శాతం పెరిగిందని క్లుగే తెలిపారు. అయితే ఫిబ్రవరిలో కంటే ఆరోగ్యాధికారులు, ఇతర అధికారులు కరోనా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని క్లుగే వెల్లడించారు.

Read More:

కాస్మొటిక్స్‌పై ‘నిఘా’ పెట్టనున్న కేంద్రం!

తెలంగాణ పారిశ్రామిక విధానంపై కేంద్ర మంత్రి ప్రశంసలు