తెలంగాణ పారిశ్రామిక విధానంపై కేంద్ర మంత్రి ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న టీఎస్ ఐపాస్ విధానం భేష్ అంటూ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు

తెలంగాణ పారిశ్రామిక విధానంపై కేంద్ర మంత్రి ప్రశంసలు
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 7:04 AM

Piyush Goyal Telangana: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న టీఎస్ ఐపాస్ విధానం భేష్ అంటూ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఈ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే, దానిపై అధ్యయనం చేస్తామని ఆయన అన్నారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో వన్‌ డిస్ట్రిక్‌- వన్ ప్రొడక్ట్‌ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పీయూష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఐపాస్ విధానంను ఆయన అభినందించారు.

ఇక ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ‘ఆత్మ నిర్బర్ భారత్‌’గా దేశం నిలవాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించడమే మార్గమని అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందించాలని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ కేపిటల్‌గా హైదరాబాద్ నగరం నిలిచిందని ఈ సందర్భంగా తెలిపారు.

అలాగే లైఫ్ సెన్సెస్‌, ఫార్మా రంగంలో అభివృద్ధికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత ఆరేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్నామని., స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా కార్యాచరణ చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు.

Read More:

తీర్పును రిజర్వులో పెట్టిన సుప్రీం కోర్టు

డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షలపై నేడే తుది తీర్పు