ఇజ్రాయెల్ – ఇరాన్‌ ప్రతీకార దాడుల వేళ కీలక పరిణామం.. అమెరికా సంచలన నిర్ణయం!

|

Oct 14, 2024 | 7:59 AM

ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి సాహసం చేయవద్దని ఇజ్రాయెల్‌ను రష్యా హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు సైనిక సహాయం అందించేందుకు అమెరికా సిద్ధమైంది.

ఇజ్రాయెల్ - ఇరాన్‌ ప్రతీకార దాడుల వేళ కీలక పరిణామం.. అమెరికా సంచలన నిర్ణయం!
Us Thaad
Follow us on

ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి సాహసం చేయవద్దని ఇజ్రాయెల్‌ను రష్యా హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు సైనిక సహాయం అందించేందుకు అమెరికా సిద్ధమైంది. అమెరికా తన అత్యాధునాతన యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌కు పంపేందుకు సిద్ధమవుతోంది.

ఇరాన్‌పై ప్రతీకార దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఈ వ్యవస్థను అమలు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ నుంచి తమ సైన్యాన్ని దూరంగా ఉంచాలని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. అమెరికా త్వరలో టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్‌‌కు పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవస్థ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ఆపగలదు. ఆదివారం(అక్టోబర్ 13) పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్ రైడర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 13, అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ వైమానిక రక్షణను బలోపేతం చేసే మిషన్‌ను ప్రారంభించినట్లు పాట్ రైడర్ తెలిపారు. ఒక టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) బ్యాటరీ, US ట్రూప్‌ల బృందాన్ని ఇజ్రాయెల్‌కు పంపనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ నుంచి తమ సైన్యాన్ని దూరంగా ఉంచాలని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లో తన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్‌ను మోహరించే అమెరికా ప్రణాళికపై ఇరాన్ ఈ హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయం కారణంగా, ఇజ్రాయెల్‌లో థాడ్ యూనిట్‌ను మోహరించాలని అమెరికా తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ యూనిట్ సంక్లిష్ట ప్రక్రియను నిర్వహించడానికి అమెరికన్ సైనికులను కూడా అక్కడ మోహరిస్తారు. అలాగే, ఇరాన్ లేదా దాని మద్దతు ఉన్న సంస్థలచే ఇజ్రాయెల్‌పై దాడికి అమెరికన్ సైనికులు కూడా హాని కలిగించవచ్చు. తమ సైనికుల భద్రత దృష్ట్యా అమెరికా వారిని ఇజ్రాయెల్‌లో మోహరించరాదని ఇరాన్‌ పేర్కొంది.

అక్టోబర్ 1న, ఇరాన్ 180కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఏకకాలంలో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ క్షిపణులను చాలా వరకు ఇజ్రాయెల్ కూల్చివేసింది. కానీ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలోకి ప్రవేశించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ భారీ దాడికి సిద్ధమైంది. ఇరాన్‌లోని దాడి ప్రదేశాల జాబితాను కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..