World Biggest Tree: ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు.. ప్రాణాలకు తెగించి రక్షించిన అగ్నిమాపక సిబ్బంది..

|

Sep 19, 2021 | 6:39 AM

World Biggest Tree Saved: పర్యావరణ కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, మానవ తప్పిదాల వంటి కారణంగా మానువులు తరచూ ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ఇలాంటి క్రమంలో

World Biggest Tree: ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు.. ప్రాణాలకు తెగించి రక్షించిన అగ్నిమాపక సిబ్బంది..
World Biggest Tree
Follow us on

World Biggest Tree Saved: పర్యావరణ కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, మానవ తప్పిదాల వంటి కారణంగా మానువులు తరచూ ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ఇలాంటి క్రమంలో కార్చిచ్చులతో అడవులు కూడా అంతరించిపోతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు కలకం సృష్టించింది. కాలిఫోర్నియాలోని గైయింట్ అడవులు దాదాపుగా పెద్ద పెద్ద మహా వృక్షాలతో విస్తరించి ఉన్నాయి. వేలాది ఏళ్ల నాటి వృక్షాలతో పచ్చదనాన్ని పరుచుకున్న ఈ అడవుల అందాలను చూడటానికి ఏటా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. అలాంటి గైయింట్‌ అడవిలో గురువారం ఒక్కసారిగా కార్చిచ్చు దానవాలంలా వ్యాపించింది.

ఈ క్రమంలో వేల ఏళ్ల నాటి మహా వృక్షాలను అగ్నికీలలు కబళించబోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టును రక్షించారు. వేల ఏళ్ల నాటి మహా వృక్షాల వైపు మంటలు వ్యాపించడం చూసి.. అప్రమత్తమైన వందలాంది మంది అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు పోరాడి కాపాడారని అధికారులు తెలిపారు. గైయింట్‌ అడవిలో దాదాపు రెండు వేల ఏళ్ల నాటి మహా వృక్షాలు ఉన్నాయని అందులో ఒక ఐదు వృక్షాలు సుమారు 3వేల ఏళ్ల క్రితం నాటివని తెలిపారు అధికారులు. ఈ చెట్ల పొడువు సుమారు.. 275 అడుగులు ఉంటుందని తెలిపారు.

అగ్నిమాపక దళ సిబ్బంది సర్వసక్తులు ఒడ్డి కాపాడారని యూఎస్‌ అగ్నిమాపక శాఖ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ గారెట్‌ తెలిపారు. ఈ కార్చిచ్చును అరికట్టేందుకు తాము ఏఎఫ్‌పీ అనే ఆపరేషన్‌ చేపట్టి అతి పెద్ద వృక్షాలతో కూడిన నేషనల్‌​పార్క్‌లను, వేల ఎకరాల అడవులను రక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఈ కార్చిచ్చులను ఎదుర్కోవడం తమ సిబ్బందికి సవాలుగా మారిందని.. అయినా సిబ్బంది ధైర్యంతో ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Also Read:

Afghan Crisis: కొన్ని వేలకోట్ల విలువజేసే 2వేల ఏళ్లనాటి నిధిపై తాలిబన్ల కన్ను… అంత డబ్బువారి చేతులో పడితే..

ఈ వ్యక్తి రోజు అర్ధగంట మాత్రమే నిద్రపోతాడు..! 12 ఏళ్లుగా ఇదే చేస్తున్నాడు.. ఎవరో తెలుసా..?