AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump: బ్రెజిల్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఆ దేశాలకు టారీఫ్ లెటర్స్.. ఏ ఏ దేశంపై ఎంత ట్యాక్స్ అంటే..?

వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులతో విరుచుకపడ్డారు. ముఖ్యంగా బ్రెజిల్‌కు బిగ్ షాకిచ్చారు. ఆ దేశంపై భారీగా పన్నులు విధించారు. మొత్తం 22 దేశాలకు ట్రంప్ టారీఫ్ లేఖలు రాశారు. శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ సహా వివిధ దేశాలపై ట్రంప్ పన్నుల మోత మోగించారు.

Trump: బ్రెజిల్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఆ దేశాలకు టారీఫ్ లెటర్స్.. ఏ ఏ దేశంపై ఎంత ట్యాక్స్ అంటే..?
Donald Trump
Krishna S
|

Updated on: Jul 10, 2025 | 9:35 AM

Share

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తన నిర్ణయాలతో అన్ని దేశాలకు షాకిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలపై ఎడాపెడా పన్నులు విధించిన ట్రంప్.. ఆ నిర్ణయాన్ని 90రోజుల పాటు నిలిపేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో మళ్లీ టారీఫ్‌ల మోతకు సిద్ధమయ్యారు. తన షరతులకు అంగీకరించి.. తమతో డీల్ కుదుర్చుకుంటే ఓకే లేకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. చైనా, యూకే వంటి దేశాలతో డీల్ కుదిరిందని.. త్వరలోనే ఆ లిస్ట్‌లో భారత్ కూడా చేరుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా షరతులకు లొంగని వివిధ దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. అందులో ఎంత టారీఫ్‌లు విధిస్తామనే విషయాన్ని వివరించారు. తాజాగా బ్రెజిల్‌కు ట్రంప్ బిగ్ షాకిచ్చారు. ఆ దేశంపై 50శాతం పన్నులు విధించారు. బ్రెజిల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బ్రూనై, అల్జీరియా, లిబియా, ఇరాక్, మోల్డోవా సహా వివిధ దేశాలకు ట్రంప్ టారీఫ్ లేఖలు పంపిచారు. ఆగస్టు 1 నుండి ఈ టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి 22 దేశాలకు ట్రంప్ లేఖలు అందాయి. వాటిలో అమెరికా మిత్రదేశాలు జపాన్, దక్షిణ కొరియా సహా ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాలు కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా బ్రెజిల్‌పై ట్రంప్ 50శాతం పన్ను విధించారు. అంతేకాకుండా మయన్మార్, లావోస్ దేశాలపై 40శాతం, కాంబోడియా, థాయిలాండ్ దేశాలపై 36శాతం, బంగ్లాదేశ్, సెర్బియా దేశాలపై 35శాతం, ఇండోనేషియాపై  32శాతం పన్ను విధించారు. శ్రీలంక, లిబియా, ఇరాక్ దేశాలపై 30శాతం, జపాన్, కజకిస్తాన్, మలేషియా, సౌత్ కొరియా, ట్యునీషియా దేశాలపై 25శాతం పన్న విధించారు. బ్రూనై, మోల్డోవా దేశాలపై 25శాతం, ఫిలిప్పీన్స్ పై 20శాత పన్ను విధించారు.

ఇక బ్రిక్స్ దేశాలపై కూడా ట్రంప్ ఆగ్రహం వెళ్లగక్కారు. ఆ కూటమి డాలర్‌ను బలహీన పరిచేందుకు ట్రై చేస్తోందని.. అందుకే ఆ దేశాలపై అదనంగా 10శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. భారత్‌తో పాటు బ్రెజిల్ కూడా బ్రిక్స్ దేశంలో భాగమే. అయితే బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారోపై అవినీతి కేసు నమోదు చేయడాన్ని ట్రంప్ గతంలో తప్పుబట్టారు. దీనిపై ఇటీవల బ్రెజిల్ ఘాటుగా స్పందించగా.. ఇప్పుడు ట్రంప్ 50శాతం పన్ను విధించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్