United States: భారతీయులకు తలనొప్పిగా మారనున్న ట్రంప్‌ కొత్త చట్టం

|

Nov 07, 2024 | 1:57 PM

అమెరికాలో సెటిల్‌ అవ్వడం ఇకపై అంత ఈజీ కాదు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వస్తున్నారు, చాలా రూల్స్‌ మార్చబోతున్నారు. అందులో ముఖ్యమైన రూల్‌.. మన దేశస్థులపై, మోస్ట్‌ ఇంపార్టెంట్లీ తెలుగువారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

United States: భారతీయులకు తలనొప్పిగా మారనున్న ట్రంప్‌ కొత్త చట్టం
Donald Trump
Follow us on

ఇకపై అమెరికా వెళ్లిన దంపతులకు పిల్లలు పుడితే వారికి వెంటనే US సిటిజన్‌షిప్‌ వచ్చే అవకాశాలు లేవు. ట్రంప్‌ తొలి సంతకం పెడతానన్న చట్టం అమల్లోకి వస్తే.. ఎన్నారైలకు.. వారి పిల్లలకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటివరకు అమెరికాలో పుట్టిన ప్రతీ పసికందుకు అక్కడి పౌరసత్వం ఆటోమేటిక్‌గా వచ్చేలా రూల్స్‌ ఉన్నాయి. అంటే కేవలం అక్కడకు కాన్పుకోసం వెళ్లినా.. పుట్టిన బిడ్డకు సిటిజన్‌షిప్‌ వచ్చేది. ఇప్పుడు ట్రంప్‌ తెచ్చే కొత్త రూల్‌తో ఆ అవకాశం లేకుండాపోతోంది. అక్రమ వలసలు.. అసంబద్ధంగా అమెరికాలో ఉండిపోయే ప్లాన్స్‌ చేసే వారిని నిలువరించేందుకు ట్రంప్‌ ఈ కొత్త చట్టం తెస్తున్నారు. H1B, F1వీసాలపై అక్కడకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నవారు, వారి కుటుంబాలకు ఇది దెబ్బే.

ఇప్పటి నుంచి అక్కడ పుట్టిన పిల్లలకు అమెరికా సిటిజన్‌షిప్‌ వచ్చే అవకాశాలు లేవు. అక్కడ బిడ్డ పుట్టినా.. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి గ్రీన్‌కార్డు కాని.. అమెరికా సిటిజన్‌షిప్‌ కాని ఉండాల్సిందే. దీంతో 12లక్షల మందిపై ఈ చట్టం ప్రభావం చూపించబోతోంది. ఎందుకంటే గ్రీన్‌కార్డు కోసం ఇప్పటికే 12లక్షల మంది క్యూలో ఉన్నారు. EB1 కేటగిరీలో లక్షన్నర మంది.. EB2 కేటగిరీలో ఎనిమిదిన్నర లక్షల మంది.. EB3 కేటగిరీలో రెండున్నర లక్షల మంది ఉన్నారు.

గ్రీన్‌ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఆరులక్షల మంది ఉంటే.. వారిపై ఆధారపడ్డ వారు ఆరున్నల లక్షలమంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్‌కార్డుల జారీనే కష్టతరంగా ఉందంటే.. ట్రంప్‌ తీసుకొస్తున్న కొత్త చట్టంతో మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే H1B వీసా స్కాంపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు ఈ చట్టంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయుల కలలు ఇంకాస్త కష్టంగా మారబోతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..