Steve Jobs: ఐఫోనే కాదు, ఆయన పాదరక్షలు కూడా ఖరిదెక్కువే.. వేలంలో అక్షరాలా ఒకటిన్నర కోట్లు…

|

Nov 16, 2022 | 2:32 PM

యాపిల్ వాచ్, యాపిల్ ఐపాడ్, యాపిల్ ఐఫోన్ అనే మాటలు వినని వారు ఉండరు. కానీ వాటి ధర వినగానే చాలా మంది ‘ అమ్మో’ అనకుండా ఉండలేరు. అలాంటి ఖరీదైన..

Steve Jobs: ఐఫోనే కాదు, ఆయన పాదరక్షలు కూడా ఖరిదెక్కువే.. వేలంలో అక్షరాలా ఒకటిన్నర కోట్లు...
Steve Jobs
Follow us on

యాపిల్ వాచ్, యాపిల్ ఐపాడ్, యాపిల్ ఐఫోన్ అనే మాటలు వినని వారు ఉండరు. కానీ వాటి ధర వినగానే చాలా మంది ‘ అమ్మో’ అనకుండా ఉండలేరు. అలాంటి ఖరీదైన బ్రాండ్ యాపిల్. అయితే చెప్పుల ధర సాధారణంగా ఎంత ఉంటుంది ? బాగా ఖరీదు అనుకుంటే లక్ష రూపాయలు.. ఇంకా పోతే పది, పదిహేను లక్షల వరకూ ధర ఉంటుంది. కానీ ఓ చెప్పుల జత ఏకంగా కోటిన్నర రూపాయలకు అమ్ముడయ్యాయి. నమ్మలేకపోతున్నారా..? కానీ తప్పదు. ఎందుకంటే అది అక్షరసత్యం. యాపిల్ వ్యవస్థాపకులలో ఒకరైన స్టీవ్ జాబ్స్‌కు ధరించే చెప్పుల జత ఓ వేలం పాటలో 218,750 డాలర్లకు అమ్ముడయ్యాయి. స్టీవ్ జాబ్స్ వ్యక్తిగతంగా కలిగిన, ధరించే బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పుల జతను రూ. 1.77 కోట్లకు విక్రయించినట్లు వేలం కంపెనీ జూలియన్స్ వేలం తెలిపింది.

దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం కూడా నవంబర్ 11న,13న చేశారు. ‘‘స్టీవ్ జాబ్స్ వ్యక్తిగతంగా సొంతం చేసుకుని, ధరించేవి బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్‌కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులు. జాబ్స్ 1970,80 లలో ఈ బ్రాండ్‌కు చిందిన చెప్పులను ధరించేవాడు.వీటిని ఇంతక ముందు స్టీవ్ జాబ్స్ హౌస్ మేనేజర్ మార్క్ షెఫ్ సొంతం చేసుకున్నాడు’’ అని చెప్పులను ప్రదర్శన చేసిన చోట వివరణగా రాసి ఉంచారు. ఈ చెప్పులు 2017లో ఇటలీలోని మిలానోలోని సలోన్ డెల్ మొబైల్‌తో సహా అనే ప్రదర్శనల్లో ఉంచారు. 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ ప్రధాన కార్యాలయంలో, న్యూయార్క్‌లోని సోహోలోని బిర్కెన్‌స్టాక్ మొదటి యునైటెడ్ స్టేట్స్ స్టోర్‌లో కూడా వీటిని పెట్టారు.

స్టీవ్ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ ఓ ఇంటర్వ్యూలో.. అతని వార్డ్రోబ్ గురించి మాట్లాడారు.‘‘ చెప్పులు అనేవి అతను సర్వసాధారణంగా ధరించే యూనిఫాం వంటివి. యూనిఫాం ప్రత్యేకత ఏమిటంటే మీరు ఉదయం ఏమి ధరించాలి? అనే దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..