War Bunkers: అణు యుద్ధం ముంచుకొస్తుందా..? బంకర్లను నిర్మించుకుంటున్న దక్షిణ కొరియా, జర్మనీ..

|

Oct 29, 2022 | 8:28 AM

అణు యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి.. రష్యా, ఉత్తర కొరియా ప్రయత్నాలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సురక్షిత బంకర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాయి కొన్ని దేశాలు..

War Bunkers: అణు యుద్ధం ముంచుకొస్తుందా..? బంకర్లను నిర్మించుకుంటున్న దక్షిణ కొరియా, జర్మనీ..
Bomb Shelter
Follow us on

నిరంతరం మిస్సైల్స్‌ ప్రయోగాలతో కవ్వించే ఉత్తర కొరియా ఇప్పుడు అణు బాంబులేస్తానని బెదిరిస్తోంది.. ఈ హెచ్చరికలు దక్షిణ కొరియాలో ఆందోళనలు పెంచాయి. ఒకవేళ కిమ్‌ అన్నంత పని చేస్తే బంక్లర్లే తమను కాపాడతాయని భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఇప్పటికే 17వేల బాంబు షెల్టర్ల నెట్‌వర్క్‌ ఉంది. కాగా ఆర్కిటెక్ట్‌ ప్రొఫెసర్ లీ టేగూ మరింత సురక్షిత బంకర్‌ సిద్దం చేశారు. అణుధార్మిక రేడియేషన్‌ బారినుంచి తట్టుకునేందుకు కాంక్రీట్‌, ఉక్కుతో గోడలను నిర్మించారు. ఇందులో ఎయిర్‌ ఫిల్టర్‌ వ్యవస్థ కూడా ఉంది. ఈ బంకరులో రెండు వారాల పాటు సురక్షితంగా తలదాచుకోవచ్చిన ఆయన చెబుతున్నారు. రాజధాని సియోల్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని జెచియోన్ నగరంలో లీ టేగూ ఈ బంకర్‌ను నిర్మించార

మరోవైపు జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం, బెర్లిన్‌ గోడ పతనం తర్వాత మరోసారి యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌ డర్టీ బాంబు, రష్యా అణ్వాయుద్ధ బూచితో తమకు ముప్పు పొంచి ఉందని జర్మన్లు భావిస్తున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఎవరూ అణ్వాయుధాలను ఉపయోగించొద్దని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కోరడం చర్చనీయాంశమైంది. ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలను రక్షించేందుకు 1960 కాలంలో నిర్మించిన సుమారు రెండు వేల బంకర్లను పునరుద్దరించాలని భావిస్తున్నారు జర్మన్‌ అధికారులు.

ఈ బంకర్లలో సామూహిక పడకలతో పాటు 14 రోజులకు అవసరమయ్యే ఆహారం, నీరు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.. సైరన్‌ మోగగానే అందరూ బంకర్లలోకి చేరుకునే విధంగా ప్రజలను అలర్ట్‌ చేయాని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. రష్యా, ఉక్రేయిన్‌ మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య డర్టీ బాంబు, న్యూక్లియర్‌ బాంబుల దాడుల గురించి మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. చాలామంది రష్యన్లు బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..