Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో..

|

Aug 07, 2024 | 9:12 PM

బంగ్లాదేశ్‌లో గురువారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పటు కానుంది. మహ్మద్‌ యూనస్‌ అధ్యక్షతన 15 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులు , ఆలయాలపై దాడులు జరగడంపై భారత్‌ భగ్గుమంటోంది. హిందువులకు రక్షణ కల్పించాలని కేంద్రం బంగ్లా అధికారయంత్రాంగాన్ని కోరింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో..
Bangladesh Crisis
Follow us on

అల్లర్లతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. గురువారం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. నోబెల్‌ విజేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటువుతోంది. తాత్కాలిక కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉంటారని ఆర్మీ చీఫ్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ వెల్లడించారు. పారిస్‌లో ఉన్న మహ్మద్‌ యూనస్‌ హుటాహుటిన ఢాకా చేరుకున్నారు.

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు షాబుద్దీన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు, విద్యార్ధి సంఘం నేతలతో చర్చలు జరిపిన తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. కోట్లాదిమంది బంగ్లాదేశ్‌ ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పింన మహ్మద్‌ యూనస్‌ తప్పకుండా పరిస్థితులను అదుపు లోకి తీసుకొస్తారన్న నమ్మకం అందరికి ఉందని తెలిపారు.

సైన్యం, విద్యార్ధుల తిరుగుబాటుతో బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా సర్కార్‌ కుప్పకూలిన తరువాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతోంది. బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇంకా అదుపులోకి రావడం లేదు. బంగ్లాదేశ్‌ నుంచి చిక్కుకున్న 18 వేల మంది భారతీయులను కాపాడడానికి కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి సమీక్ష నిర్వహించారు.

హిందువులను అల్లరిమూకలు టార్గెట్‌ చేయడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్ములో డోగ్రా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మను తగలబెట్టారు. హిందువులు, ఆలయాలపై దాడులను అరికట్టేలా కేంద్రం వెంటనే కొత్త సర్కార్‌పై ఒత్తిడి తేవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

హింసలో 455 మంది మృతి

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసలో 455 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సామాన్య పరిస్థితులు నెలకొనేలా కృషి చేస్తానని మహ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. ఈ బాధ్యతను చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని , శాంతి నెలకొల్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజువల్స్‌

మరోవైపు మాజీ ప్రధాని భవితవ్యంపై సస్సెన్స్‌ కొనసాగుతోంది. గత మూడు రోజుల నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం తీసుకుంటున్నారు. యూపీలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌ సేఫ్‌ హౌస్‌లో హసీనా ఉన్నారు. సోదరి రెహానాతో కలిసి ఆమె అక్కడ ఉన్నారు. మరికొద్దిరోజుల పాటు ఆమె భారత్‌ లోనే బస చేసే అవకాశం ఉంది.

భారత్ లో హై అలర్ట్..

బంగ్లాదేశ్‌లో అలర్ల కారణంగా భారత్‌ సరిహద్దుల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. వేలాదిమంది భారత్‌ లోకి అక్రమంగా ప్రవేశించే అవకాశం ఉండడంతో బీఎస్‌ఎఫ్‌ గట్టి నిఘా పెట్టింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల ప్రభావం భారత వాణిజ్య ఎగుమతులపై పడింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉల్లి, ఇతర పండ్ల సరఫరా నిలిచిపోయింది. సరిహద్దులో వందకుపైగా ట్రక్కులు నిలిచిపోయాయి. బోర్డర్‌లో ఉల్లి సరఫరా చేసే ట్రక్కులు నిలిచిపోయాయి. నాసిక్‌ ఉల్లి ఎగుమతులకు బంగ్లాదేశ్‌లో యమా డిమాండ్‌ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఉల్లి పాడైపోయే ఛాన్స్‌ ఉంది. రూ. 60 నుంచి 70కోట్ల వరకూ నష్టపోతున్నారు రైతులు. బంగ్లాదేశ్‌లో ఉల్లి లారీలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీకి రైతులు లేఖ రాశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..