AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ఒక్కసారిగా బయటికి దూసుకెళ్లిన ప్రయాణికుడు! భార్య తెలివితో..

జర్మనీకి వెళ్తున్న రయాన్ఎయిర్ విమానంలో గాలిలోనే ఇంజిన్ లోపం చోటుచేసుకోవడంతో కిటికీ పగిలి క్యాబిన్‌లో డీకంప్రెషన్ ఏర్పడింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడు పాక్షికంగా బయటకు లాగబడగా, పైలట్లు గ్రీస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఘటనలో పలువురు గాయపడగా, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ఒక్కసారిగా బయటికి దూసుకెళ్లిన ప్రయాణికుడు! భార్య తెలివితో..
Ryanair Flight
SN Pasha
|

Updated on: Jul 11, 2026 | 9:20 AM

Share

జర్మనీలోని మెమ్మింగెన్‌కు వెళ్తున్న రయాన్ఎయిర్ విమానంలో శుక్రవారం తీవ్ర సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఇంజిన్‌లో లోపం ఏర్పడటంతో దాని శకలం విమానం బాడీని ఢీకొని, ఒక కిటికీ ధ్వంసమైంది. దీంతో క్యాబిన్‌లో ఒక్కసారిగా గాలి పీడనం తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో పైలట్లు విమానాన్ని గ్రీస్‌లోని థెస్సలోనికి అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానయాన అధికారుల సమాచారం ప్రకారం.. థెస్సలోనికి నుంచి బయలుదేరిన రయాన్ఎయిర్ విమానం FR1879 ఉత్తర మాసిడోనియా గగనతలంలో ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఇంజిన్ నుంచి విడిపోయిన శకలం విమానం పక్క భాగాన్ని ఢీకొట్టడంతో కిటికీ పగిలిపోయింది. వెంటనే క్యాబిన్‌లో డీకంప్రెషన్ ఏర్పడింది.

అయితే ఈ ఘటనలో మరో భయంకర పరిస్థితి కూడా చోటు చేసుకుంది. కిటికీ పగిలిపోవడంతో గాలి బయటికి వెళ్లే వేగానికి ఆ కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల సెర్బియా జాతీయుడు సగం బయటికి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు అతని భార్య వెంటనే అతన్ని పట్టుకోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే.. విమానం నుంచి అతను పడిపోయేవాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇతర ప్రయాణికులు కూడా తీవ్ర షాక్‌కు గురయ్యారు. విమాన సిబ్బంది వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, విమానాన్ని వేగంగా తక్కువ ఎత్తుకు దించి థెస్సలోనికి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. రన్‌వేపై ముందుగానే అత్యవసర సేవలు, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు సిద్ధంగా ఉండటంతో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించారు.

వీడియో చూడండి

ఈ ఘటనలో గాయపడిన 61 ఏళ్ల వ్యక్తికి భుజాలు, శరీర పైభాగంలో గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు, షాక్ కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మిగిలిన ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై రయాన్ఎయిర్ విడుదల చేసిన ప్రకటనలో, విమానాన్ని థెస్సలోనికికి మళ్లించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, ప్రధాన కారణంగా కిటికీ వైఫల్యాన్నే పేర్కొంది. ఇంజిన్ వైఫల్యం తీవ్రతపై సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు, మిగిలిన ప్రయాణికులను జర్మనీలోని మెమ్మింగెన్‌కు చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే