Russia Ukraine Crisis: బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చిన గూగుల్‌ పే, యాపిల్‌.. నిలిచిపోయిన సర్వీసులు

|

Mar 02, 2022 | 9:51 AM

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండు దేశాల ఉద్రిక్తతల పరిస్థితుల కారనంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన ప..

Russia Ukraine Crisis: బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చిన గూగుల్‌ పే, యాపిల్‌.. నిలిచిపోయిన సర్వీసులు
Follow us on

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండు దేశాల ఉద్రిక్తతల పరిస్థితుల కారనంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధాలు ఇతర దేశాలపై ప్రభావం పడుతోంది. ధరలు సైతం పెరిగిపోయే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్లు, బంగారం ధరలు, నిత్యవసర సరుకులపై ప్రభావం పడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూనే వస్తున్నాయి. తాజాగా రష్యన్‌ బ్యాంకు కస్టమర్లకు  (Bank Customers) గూగుల్‌పే, యాపిల్‌ పే సర్వీసులు నిలిచిపోయాయి. గూగుల్‌ పే (Google Pay), యాపిల్‌ పే (Apple Pay) సర్వీస్‌ ప్రొవైడర్లు పలు రష్యన్‌ బ్యాంకు కస్టమర్లకు సర్వీసులను నిలిపివేశాయి. రష్యన్‌ బ్యాంకు కస్టమర్లు ఈ సేవలు పొందేందుకు అవకాశం ఉండదు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రష్య వివరాల ప్రకారం.. ఆంక్షలు ఎదుర్కొంటున్న బ్యాంకుల కస్టమర్లు విదేశాల్లో కార్డుల ద్వారా చెల్లింపులు నిర్వహించే వీలుండదు. ఇక నుంచి గూగుల్‌ పే, యాపిల్‌ పే ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేదు.

అయితే రష్యాలో యాపిల్‌ పే, గూగుల్‌ పే వంటి సర్వీసులు ఉపయోగించే వారు తక్కువగానే ఉన్నారు. ఇవి రెండు కంపెనీలు కూడా అమెరికాకు చెందిన కావడం రష్యన్లు వీటిని తక్కువగా వాడుతుంటారు. రష్యాలో 29 శాతం మంది గూగుల్‌ పే, 20 శాతం మంది యాపిల్‌ పే సర్వీసులను ఉపయోగిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతుండటంతో పలు దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ట్రాన్సాక్షన్లు జరపకుండా ఆంక్షలు విధిస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి:

Apple Product: సంచలన నిర్ణయం.. అక్కడ ఆపిల్‌ ఉత్పత్తుల విక్రయాల నిలిపివేత..!

Ukraine-Russia War: ఉక్రెయిన్‌లో ఆ గుర్తులున్న భవనాలపైనే ఎటాక్స్.. రష్యా రహస్యం అదేనా..?