AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో హిందూ సమాజానికి రక్షణ.. ప్రతినిధుల సభలో చారిత్రాత్మక తీర్మానం..!

అమెరికా అభివృద్ధిలో హిందూ-అమెరికన్ సమాజం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తూ, ఒక ముఖ్యమైన తీర్మానం అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ముందుకు వచ్చింది. , వారిపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలను తీవ్రంగా ఖండించేలా ఈ తీర్మానాన్ని తీసువచ్చారు. మిచిగాన్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదార్ ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అమెరికాలో హిందూ సమాజానికి రక్షణ..  ప్రతినిధుల సభలో చారిత్రాత్మక తీర్మానం..!
Shri Thanedar And Ro Khanna
Balaraju Goud
|

Updated on: Jun 02, 2026 | 2:50 PM

Share

అమెరికా అభివృద్ధిలో హిందూ-అమెరికన్ సమాజం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తూ, ఒక ముఖ్యమైన తీర్మానం అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ముందుకు వచ్చింది. , వారిపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలను తీవ్రంగా ఖండించేలా ఈ తీర్మానాన్ని తీసువచ్చారు. మిచిగాన్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదార్ ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అమెరికా రాజకీయ వర్గాల నుండి, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన ప్రతిప్రతినిధుల నుండి నిరంతర మద్దతు లభిస్తోంది.

తాజాగా, ప్రముఖ భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఈ తీర్మానానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. అమెరికా సమాజానికి హిందూ సమాజం చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. 2025 జనవరి 24న ఈ తీర్మానాన్ని మొదటగా సభలో ప్రవేశపెట్టగా, అప్పటి నుండి దీనికి మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 32 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు పలకడం విశేషం. ఈ తీర్మానానికి సహ-ప్రాయోజకులుగా భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రమణియన్ కూడా వ్యవహరిస్తున్నారు.

తీర్మానంలోని ముఖ్యాంశాలు:

  1. బహుముఖ సేవలకు గుర్తింపు: అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం, విజ్ఞాన శాస్త్రం, విద్య, వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాలలో హిందూ-అమెరికన్లు అందించిన అసాధారణ సేవలను ఈ తీర్మానం అధికారికంగా గౌరవిస్తుంది.
  2. ద్వేషపూరిత చర్యలపై ఖండన: అమెరికాలో ఇటీవల కాలంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేకతను, హిందూ వ్యతిరేక దురభిమానాన్ని, హిందూ ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులను, విద్రోహ చర్యలను ఈ తీర్మానం తీవ్రంగా ఖండిస్తోంది.
  3. సమానత్వానికి ప్రాధాన్యత: అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో ఏ మతం లేదా సమాజం పట్ల అయినా ద్వేషం, వివక్ష చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది.

అమెరికా ప్రగతిలో తాము భాగస్వాములమే కాక, దేశ భద్రత, శాంతిభద్రతలను గౌరవించే పౌరులుగా హిందూ సమాజానికి ఈ తీర్మానం ఒక పెద్ద ముందడుగు. ఇది వారి సేవలను అధికారికంగా గుర్తించడంతో పాటు, భవిష్యత్తులో వారి రక్షణకు, హక్కుల సాధనకు ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..