AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Foreign Tours: విదేశీపర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.. పూర్తి వివరాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీపర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి ఘనా, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా దేశాల్లో ప్రధాని పర్యటిస్తారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదట జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటింటి.. ఆదేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు.

PM Modi Foreign Tours: విదేశీపర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.. పూర్తి వివరాలు ఇవే!
Modi
Anand T
|

Updated on: Jul 01, 2025 | 9:13 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీపర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఐదు దేశాల ప్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మొత్తం 10 దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌ వెళ్తున్న ప్రధాని..గ్లోబల్‌ సౌత్‌లోని పలు కీలక దేశాలతో భారత్‌ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ నెల 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ప్రధాని రెండు ఖండాలను కవర్‌ చేయనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.

ఇక పర్యటనలో భాగంగా జూలై 2-3 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా నుండి ఐదు దేశాల పర్యటనను మోదీ ప్రారంభిస్తారు. ఘనాకు మోదీ తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది, మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనా పర్యటన వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నరు. ఈ చర్చల తర్వాత ఆదేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

తర్వాత మోదీ జూలై 3-4 తేదీలలో కరేబియన్‌లోని ట్రినిడాడ్ & టొబాగో దేశంలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్‌తో మోదీ చర్చలు జరపనున్నారు. భారతదేశం-ట్రినిడాడ్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ చర్చిస్తారు. ఈ చర్చల తర్వాత ఆదేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు.

ఇక జూలై 4-5 తేదీలలో ప్రధాని మోదీ అర్జెంటీనాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించనున్నారు.

ఇక జూలై 5-8 తేదీలలో ప్రధాని బ్రిజిల్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు మోడీ బ్రెజిల్‌కు వెళ్లి రియోలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొననున్నారు. ఆ తర్వాత రాజధాని బ్రెసిలియాలో ప్రధాని పర్యటించనున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ అనేక ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది.

ఇక చివరి దశలో, అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా ఆహ్వానం మేరకు జూలై 9న ప్రధాని ఆఫ్రికన్ దేశమైన నమీబియానలో పర్యటించనున్నారు. ఈ దేశంలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటి సారి. అధ్యక్షుడు నంది-న్దైత్వాతో చర్చలు జరపడంతో పాటు, ప్రధాని నమీబియా వ్యవస్థాపక పితామహుడు, సామ్ నుజోమాకు మోదీ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది