Emmanuel Macron: నరేంద్ర మోదీ చెప్పిందే కరెక్ట్.. భారత ప్రధానిపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రశంసలు..

|

Sep 21, 2022 | 2:19 PM

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ ప్రశంసించారు. అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి

Emmanuel Macron: నరేంద్ర మోదీ చెప్పిందే కరెక్ట్.. భారత ప్రధానిపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రశంసలు..
Emmanuel Macron
Follow us on

Emmanuel Macron: ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ ప్రశంసించారు. అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 77వ సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో మోదీ పుతిన్‌కి ఇచ్చిన సందేశం సరైనదేనని అన్నారు. ఇది యుద్ధానికి సరైన సమయం కాదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను పునురుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదర్కొనే సమయం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ హితువు పలికారు. ఇదే విషయంపై ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ మాట్లాడుతూ నరేంద్ర మోదీని ప్రసంశలతో ముంచెత్తారు. యుద్ధానికి ఇది సమయం కాదని నరేంద్రమోదీ చెప్పిన మాటలు అక్షరసత్యం. ఈ యుగం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడమో లేదా తూర్పునకు మద్దతుగా వారిని వ్యతిరేకించడమో కాద, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన సమయం. అందుకే ఇప్పుడు మనమంతా ఓ కొత్త ఒప్పందం చేసుకోవాల్సిన అవసరముంది. ఆహారం, జీవ వైవిధ్యం, విద్యను సమానంగా అందించేలా సమర్థమైన ఒప్పందాన్ని తయారుచేసుకోవాలని మాక్రాన్ పేర్కొన్నారు.

ఒకరినొకరు అడ్డుకోవడం కాదు.. పరస్పర ప్రయోజనాల కోసం సంకీర్ణ చర్యలు చేపట్టాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
ఇటీవల ఉజ్బెకిస్థాన్‌ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి పుతిన్‌తో పరోక్షంగా ప్రస్తావించారు. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని సూచించిన భారత ప్రధాని.. ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను రష్యా అధ్యక్షుడికి సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన వ్లాదిమిర్ పుతిన్‌.. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..