Philippines Floods: భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం.. 47 మంది మృతి.. వందలాది మంది గల్లంతు..

|

Oct 29, 2022 | 9:22 AM

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాతో పాటు అనేక ప్రాంతాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి. సముద్రంలో కల్లోల పరిస్థితులు ఉండటంతో నౌకలను, ఇంటర్-ఐలాండ్ ఫెర్రీలు నిలిపివేశారు.

Philippines Floods: భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం.. 47 మంది మృతి.. వందలాది మంది గల్లంతు..
Philippines Floods
Follow us on

నాల్గే తుఫాను బీభత్సానికి ఫిలిప్పీన్స్‌ అల్లాడిపోయింది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో తీరప్రాంతంలో చెట్లు నేలకొరగడంతో పాటు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.. భారీ వర్షాల కారణంగా వరదలకు నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి.. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి.. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. బురదరాళ్లు మట్టితో వరద నీరు వీధుల్లో ప్రవాహించింది. మూడు లక్షల జనాభా ఉన్న కోటాబాటో నగరాన్ని తుఫాను భారీగా దెబ్బతీసింది. ఈ తుఫాను కారణంగా 67 మంది మరణించారు. అధికారిక లెక్కల ప్రకారం.. 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. లక్ష కుటుంబాలు ఈ తుఫాన్ కు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగి పడి వందలాది మంది గల్లంతయినట్లు పేర్కొంటున్నారు.

దాతు ఒడిన్‌ సిసువాత్‌ పట్టణం సమీపంలోని కుసియోంగ్‌ గ్రామంలోనే 50 మంది మరణించినట్లు పేర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందునే హెచ్చరించడంతో ప్రాణ నష్టం తగ్గిందంటున్నారు. వరదలో చిక్కుకున్న అనేక మందిని సహాయక బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.. దాదాపు 7 వేల మందిని కాపాడారు ఆర్మీ దళాలు, పోలీసులతో పాటు అనేక మంది వాలంటీర్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వాలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాతో పాటు అనేక ప్రాంతాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి. సముద్రంలో కల్లోల పరిస్థితులు ఉండటంతో నౌకలను, ఇంటర్-ఐలాండ్ ఫెర్రీలు నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు కూడా వరదల్లో చిక్కకున్నారు.. వర్షాలు మరి కొద్ది రోజులు కొనసాగడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వరదల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..