కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటాం: పాకిస్తాన్‌ అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

|

Aug 24, 2021 | 9:28 PM

కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటామంటూ పాకిస్తాన్‌ అధికార పార్టీ తెహీరిక్‌ ఈ ఇన్సాఫ్‌ (PTI) నేత నీలం ఇర్షద్‌ షేక్‌

కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటాం: పాకిస్తాన్‌ అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
Follow us on

దయాది పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటామంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అయిన తెహీరిక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేత నీలం ఇర్షాద్‌ షేక్‌ బహిరంగంగా వెల్లడించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌ డిబెట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కశ్మీర్‌ అంశంపై తాలిబన్లు తమతో జత కలుస్తారని, తమకు సహాయపడతారంటూ నీలం ఇర్షాద్‌ షేక్‌ తెలిపారు.
తాలిబన్లతో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు, కశ్మీర్‌ అంశంపై వారు తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. అయితే కశ్మీర్‌ అంశం భారతదేశ అంతర్గత, దైపాక్షిక సమస్యగా గతంలోనే తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, కశ్మీర్‌ అంశంపై పీటీఐ నాయకురాలు నీలం ఇర్షాక్‌ వ్యాఖ్యలు చేయగానే ఆ ఛానల్ యాంకర్ ఆమెను అలర్ట్ చేశారు. ” మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా.. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారత్‌లో కూడా దీనిని వీక్షిస్తారు” అంటూ ఆ యాంకర్‌ నీలం ఇర్షాద్‌ షేక్‌ను సూచించారు. కానీ యాంకర్‌ మాటలను ఇర్షాద్‌ షేక్‌ పట్టించుకోలేదు.

 

ఇవీ కూడా చదవండి:

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..!

Afghan – India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?