AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా గగనతలాన్ని మూసేయలేదు: పాకిస్తాన్

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించడం లేదని.. మరికొన్ని విమానాలను దారి మళ్లించారని వార్తలు వచ్చాయి. వీటిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి ముజ్తబా భేగ్ స్పందించారు. ఎప్పటిలాగే విమానాలు నడుస్తున్నాయని, ఏ ఒక్క మార్గంలోనూ దారి మళ్లింపు చేపట్టలేదని వివరణ […]

మా గగనతలాన్ని మూసేయలేదు: పాకిస్తాన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 7:50 AM

Share

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించడం లేదని.. మరికొన్ని విమానాలను దారి మళ్లించారని వార్తలు వచ్చాయి. వీటిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి ముజ్తబా భేగ్ స్పందించారు. ఎప్పటిలాగే విమానాలు నడుస్తున్నాయని, ఏ ఒక్క మార్గంలోనూ దారి మళ్లింపు చేపట్టలేదని వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ సైతం ధ్రువీకరించారు. కాగా భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేసిందని.. దీనివలన విమానాల తరలింపుకు మరో 12నిమిషాల అదనపు సమయం పడుతుందని.. అయినా పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వలన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎయిర్‌ ఇండియా అధికారులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్