North Korea” కరోనాపై ఉత్తర కొరియా షాకింగ్ కామెంట్స్.. అలా చేయడం వల్లే కేసులు పెరిగాయని ఆరోపణ

|

Jul 01, 2022 | 4:02 PM

ఉత్తర కొరియాలో (North Korea) కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ నిలకడగా ఉన్నప్పటికీ.. కిమ్ రాజ్యంలో మాత్రం కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై దేశ ఆరోగ్యశాఖ కీలక...

North Korea కరోనాపై ఉత్తర కొరియా షాకింగ్ కామెంట్స్.. అలా చేయడం వల్లే కేసులు పెరిగాయని ఆరోపణ
North Korea
Follow us on

ఉత్తర కొరియాలో (North Korea) కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ నిలకడగా ఉన్నప్పటికీ.. కిమ్ రాజ్యంలో మాత్రం కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై దేశ ఆరోగ్యశాఖ కీలక కామెంట్స్ చేసింది. తమ దేశంలో కరోనా వ్యాప్తికి విదేశీ వస్తువులే కారణమని దక్షిణ కొరియా(South Korea)పై మండి పడింది. విదేశీ వస్తువులు తాకడం వల్లే కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది. సరిహద్దుల వెంట గాలి, వాతావరణం, బెలూన్ల ద్వారా వచ్చే విదేశీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. కుమ్‌గాంగ్ పర్వత ప్రాంతంలోని ప్రజలు గుర్తుతెలియని వస్తువులను తాకడం వల్ల 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారికి జ్వరం లక్షణాలు కనిపించాయని తెలిపింది. ఆ తర్వాత వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అక్కడి ఇఫోరి ప్రాంతం నుంచి ఏప్రిల్ మధ్యలో రాజధానికి వచ్చిన అనేక మందిలో జ్వరం ఉన్నట్లు గుర్తించామని, వారి రాకపోకలతో దేశంలో అనూహ్యంగా కేసులు పెరిగాయని వెల్లడించింది.

మరోవైపు.. ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు, కార్యకర్తలు ఇరు దేశాల సరిహద్దుల వద్ద బెలూన్లు ఎగరవేస్తుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. వాటి ద్వారా కరపత్రాలు, మానవతా సహాయాన్ని అందిస్తుంటారు. అయితే భద్రతా కారణాలతో దక్షిణ కొరియా మునుపటి ప్రభుత్వం ఈ చర్యలపై నిషేధం విధించింది. కాగా.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బెలూన్ల ఎగరవేయడం వంటివి మళ్లీ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..