భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినాలో ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ కూడా సదస్సుకు హాజరవుతారు. రెండు దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు, ప్రముఖ విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నవంబర్ 22 అనగా శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ పద్దతిలో తన కీ నోట్ ప్రసంగం చేస్తారు. ప్రధాని మోదీతో సహా మరో ఇద్దరు కేంద్రమంత్రులు ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించనున్నారు. వారిలో ఒకరు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కాగా.. మరొకరు కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.
వివిధ రంగాలలో భారతదేశం, జర్మనీల మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులతో ఈ సమ్మిట్‌లో చర్చ జరగనుంది. ‘ఇండియా & జర్మనీ: కనెక్ట్ ఫర్ గ్రోత్’ అనే థీమ్‌తో భారత్, జర్మనీ కీలకమైన ఇంజనీరింగ్, సాంకేతికత విభాగాల్లో తమ బలాబలాలను దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నాయో అనేది ఈ సమ్మిట్‌లో చర్చిస్తారు.
4:30 PM – MHP అరేనాలో అతిథుల రాక
5:15 PM – జాతీయ గీతం – భారతదేశం & జర్మనీ
5:30 PM – TV9 నెట్‌వర్క్ బరుణ్ దాస్ MD & CEO ద్వారా ఓపెనింగ్ విజిల్
5:35 PM – రూవెన్ కాస్పర్ ద్వారా స్వాగత ప్రసంగం
5:40 PM – రాష్ట్ర రాజకీయ కార్యదర్శి ఫ్లోరియన్ హాస్లర్ రాష్ట్ర స్వాగతం
5:50 PM – మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం
6:05 PM – మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగం
6:20 PM – మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రామురావు జూపల్లి ప్రసంగం
6:25 PM – అజిత్ గుప్తే, భారత రాయబారి, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ప్రసంగం