భారీ వర్షాలు.. ఊడుతోన్న విమానాశ్రయ పైకప్పు

| Edited By:

Aug 17, 2020 | 3:46 PM

పాకిస్తాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో కొత్తగా కట్టిన ఎయిర్‌పోర్టు పైకప్పు కూలిపోయింది.

భారీ వర్షాలు.. ఊడుతోన్న విమానాశ్రయ పైకప్పు
Follow us on

Islamabad airport ceiling: పాకిస్తాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో కొత్తగా కట్టిన ఎయిర్‌పోర్టు పైకప్పు దెబ్బతింది. పెచ్చులు పెచ్చులుగా ఊడుతోంది. దీనిపై ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆగష్టు 14న ఉదయం ఈ ఘటన జరిగినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌ పరివాహక ప్రాంతాల్లో భారీ మెరుపులతో కూడిన వర్షం కురవడంతోనే  పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. కాగా రెండేళ్ల క్రితమే ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు.

దీనిపై పాకిస్తాన్ ఫెడరల్‌ ఏవియేషన్ మినిస్టర్‌ చులమ్‌ సర్వర్ ఖాన్ స్పందిస్తూ.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్‌ని ఆదేశించారు. ఇక అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు త్వరలో ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టుకు మంత్రి చులమ్‌ వెళ్లనున్నారు.

Read More:

Bigg Boss 4: హౌజ్‌లోకి వెళ్లేది వీరే.. చక్కర్లు కొడుతోన్న లిస్ట్!

సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం