Plant Tree in Pothole: రోడ్డు రిపేర్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం.. గుంటలో మొక్కనాటి స్థానికుల నిరసన.. ఎక్కడంటే

|

Feb 16, 2021 | 2:20 PM

పల్లెలు, పట్టణాలు, అనే తేడా లేకుండా ప్రధాన రహదారుల్లో రోడ్ల మధ్యంలో గుంతలు సర్వసాధారణం.. అలాంటి రోడ్లను రిపేర్ చేయించండి మహాప్రభో అంటూ ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకుంటాం.. అధికారులు స్పందించి..

Plant Tree in Pothole: రోడ్డు రిపేర్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం.. గుంటలో మొక్కనాటి స్థానికుల నిరసన.. ఎక్కడంటే
Plant-in-pothole-to-fix-roa
Follow us on

Plant in Pothole to Fix Road : పల్లెలు, పట్టణాలు, అనే తేడా లేకుండా ప్రధాన రహదారుల్లో రోడ్ల మధ్యంలో గుంతలు సర్వసాధారణం.. అలాంటి రోడ్లను రిపేర్ చేయించండి మహాప్రభో అంటూ ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకుంటాం.. అధికారులు స్పందించి ఆ రహదాలను రిపేర్ చేస్తే సరి.. లేదంటే ఎం చేయలేమని.. రోడ్డు మధ్యలో గుంతలు ఉన్నాయి.. వాహనదారులకు తెలియడానికి ఏ కర్రనో.. పచ్చని కొమ్మనో పెట్టి వాహనదారులను అలర్ట్ చేస్తుంటాం అయితే అక్కడ స్థానికులు ఏకంగా మొక్కనే నాటేశారు. అయితే వారు వాహనదారులను అలర్ట్ చేయడానికి ఈ మొక్కను నాటలేదు.. రోడ్లు రిపేర్ చేయడం లేదని నిరసన తెలియజేయడానికి ఇలా చేశారు.. ఈ వింత నిరసనను ఆస్ట్రేలియాలో డైమండ్ క్రీక్ ప్రజలు తెలిజేశారు.

మెల్‌బౌర్న్‌-విక్టోరియా మధ్యలో ఉన్న డైమండ్ క్రీక్ ప్రాంతంలో రోడ్ మధ్యలో ఇటీవల ఒక గుంత ఏర్పడింది. ఈ గుంటపై అవగాహన లేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో రోడ్డు సమస్యను అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.. అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
స్థానిక కౌన్సిల్ ముందు ఈ సమస్యను పెట్టగా..అతను ఈ సమస్య విక్టోరియా రోడ్స్‌ విభాగం కిందకు వస్తుందని తెలిపాడు. వారేమో ఇది మెట్రో ట్రైన్‌ సమస్యని తమ పరిధిలోకి రాదని చెప్పారు. ఎవరికి రోడ్డు గుంతల గురించి చెప్పినా సమస్య తమ పరిధిలోకి రాదు అని అనడంతో.. విసుగెత్తిన స్థానికులు రోడ్డు ధ్యలో ఏర్పడిన గుంతలో ఏకంగా ఓ మొక్కను నాటేశారు.. అంతేకాదు ఇది

అధికారుల నిర్లక్ష్యానికి.. లెక్కలేని తనాన్ని అర్ధం అంటూ కొంతమంది స్థానికులు ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు మీరు చేసిన పని కరెక్ట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

చురుకుగా ఉపసంహరణలు, తోక ముడుస్తున్న చైనా, పాంగాంగ్ సో వద్ద జెట్టీ, హెలిపాడ్ ధ్వంసం

అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా